Breaking News

‘5వేల మందిని చూశాడు..చివరికి ఓ అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు’

Published on Tue, 02/06/2024 - 17:05

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్‌ చాట్‌జీపీటీ ఇప్పుడు మరో సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. ఇన్ని రోజులు యూజర్లు వ్యాపార వ్యవహారాల్ని చక్కబెట్టుకునేందుకు చాట్‌జీపీటీని ఉపయోగించే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. చాట్‌జీపీటీతో తమ గుణగణాలకు సరిపోయే భాగస్వామిని వెతుక్కుంటున్నారు. 

తాజాగా, రష్యాకు చెందిన అలెగ్జాండర్ జాదన్ ఇప్పుడు సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారారు. డేటింగ్‌ యాప్‌ టిండర్‌లో తనకు తగ్గ యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ విఫలమయ్యాడు. తాను కొత్తగా ఓ అమ్మాయిని కలిసిన ప్రతి సారి ఏదో ఒక ప్రశ్నలు తలెత్తేవి. ఈ ప్రశ్నల ప్రవాహానికి పులిస్టాప్‌ పెట్టేందుకు చాట్‌జీపీటీని ఆశ్రయించాడు. 

చాట్‌జీపీటీని టిండర్‌లో మ్యాచ్‌మేకర్‌గా మార్చాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ను ఉపయోగించి ఓ బాట్‌ను తయారు చేశాడు. ఆ బాట్‌ సాయంతో సుమారు టిండర్‌లో తనకు సరిపోయే అమ్మాయి కోసం సుమారు 5240 మందిని తన ప్రొఫైల్‌తో మ్యాచ్‌ చేసి.. అందులో ఒక్క అమ్మాయిని త్వరలో వివాహం చేసుకోనున్నాడు.  

టిండర్‌లో తనని ఏడాది నుంచి కమ్యునికేట్‌ అవుతున్న యువతిని చాట్‌జీపీటీ సాయంతో ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. ఇందుకోసం మెషిన్‌ లెర్నింగ్‌లో ఓ భాగమైన ఆర్టిఫిషియల్‌ న్యూరాల్‌ నెట్‌వర్క్‌తో 5240లో ఒక్క అమ్మాయిని ఎంపిక చేసుకోగలిగానని ట్వీట్‌ చేశాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది? దానికి కథాకమామిషు ఏంటో చెప్పకనే చెప్పాడు. 

‘నేను ఓ యువతిని గాఢంగా ప్రేమించాను. కానీ అన్వేక కారణాల వల్ల రెండేళ్లకే విడిపోవాల్సి వచ్చింది. ప్రేమ చేసిన గాయానికి తట్టుకోలేకపోయాను. కొన్ని నెలల పాటు తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. చివరికి దాన్ని నుంచి తేరుకునేందుకు టిండర్‌లో మరో యువతి కోసం ప్రయత్నించా. అలా ఒక యువతితో ప్రారంభమై 5240 మందిని వెతుక్కున్నాను. ఫలితం శూన్యం 

డేటింగ్‌ యాప్‌లో తనకు నచ్చిన అమ్మాయిని చూసుకోవడం, ఆమెతో చాటింగ్‌ చేయడం, నేరుగా కలుసుకోవడం ఇలా చేస్తుండేవాడిని. ఈ ప్రాసెస్‌లో లెక్కలేనన్ని అవమానాలు,రిజెక్షన్‌లు ఎదుర్కొన్నాను. ఫైనల్‌గా చాట్‌జీపీటీని ఆశ్రయించి నాలోని బాధను వెళ్లగక్కాను. నాకే ఎందుకిలా జరుగుతుందని చాట్‌జీపీని ప్రశ్నించా. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టూల్‌ను తయారు చేశాను. చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్ తనకు భార్యగా కరీనానే సరైన జోడిగా నిర్ణయించింది. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నానంటూ అలెగ్జాండర్ జాదన్ తన కథను ముగించాడు.

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)