Breaking News

మన రూపాయి.. మరో కొత్త కనిష్ట స్థాయి

Published on Thu, 02/06/2025 - 07:04

ముంబై: అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధభయాల కారణంగా ఇన్వెస్టర్లు రిస్కులు తీసుకోవడానికి ఇష్టపడకపోతుండటంతో రూపాయి (Rupee) మారకం విలువపై మరింతగా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో దేశీ కరెన్సీ రోజురోజుకూ కొత్త కనిష్టాలకు జారిపోతోంది. తాజాగా బుధవారం డాలరుతో (US dollar) పోలిస్తే మరో 36 పైసలు క్షీణించి ఇంకో రికార్డు కనిష్ట స్థాయి 87.43కి పడిపోయింది.

ఒక దశలో 87.49 కనిష్ట స్థాయిని కూడా తాకింది. అమెరికా, చైనా టారిఫ్‌ల ప్రభావాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తుండటంతో రూపాయిపై ప్రభావం పడుతోందని ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు. భారత్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, విదేశీ మార్కెట్లలో డాలరు బలపడుతుండటం కూడా మదుపరుల సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయని వివరించారు.

ద్రవ్యోల్బణం నిర్దిష్ట స్థాయికి పరిమితం కావడంతో ఆర్‌బీఐ ఈసారి పాలసీ రేట్లను 0.25 శాతం తగ్గించవచ్చనే  అంచనాలు ఉన్నాయి. మూడు రోజుల పాటు సాగే ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం బుధవారం  ప్రారంభమైంది. ఫిబ్రవరి 7న విధాన నిర్ణయాలను ఎంపీసీ ప్రకటించనుంది.  

అమెరికా డాలరు బలోపేతం అవుతుండటంవల్లే దానితో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గుతోందని నీతి ఆయోగ్‌ సభ్యుడు అరవింద్‌ విర్మాణీ తెలిపారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ దేశం జపాన్‌ యువాన్‌తో కూడా రూపాయిని పోల్చి చూడాల్సిన అవసరం ఉందన్నారు. రూపాయిని నిర్దిష్ట స్థాయికి పరిమితం చేయడం ఆర్‌బీఐ విధానం కాదని, తీవ్ర స్థాయిలో ఒడిదుడుకులను కట్టడి చేసేందుకు మాత్రమే అవసరమైతే జోక్యం చేసుకుంటుందని వివరించారు.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)