Breaking News

రూపాయిని గట్టి దెబ్బ కొట్టిన టారిఫ్‌లు.. ఆల్‌టైమ్‌ పతనం

Published on Fri, 08/29/2025 - 15:40

భారత కరెన్సీ రూపాయి విలువపై అమెరికా టారిఫ్‌ల  దెబ్బ గట్టిగా తగిలింది. భారత వస్తువులపై అమెరికా సుంకాల పెంపుపై ఇన్వెస్టర్ల ఆందోళనలతో శుక్రవారం డాలర్ తో పోలిస్తే భారత రూపాయి రికార్డు స్థాయిలో 87.9650కు పడిపోయింది. భారత్‌ నుంచి వచ్చే వస్తువులపై ఇటీవల 25% సుంకాన్ని విధించిన అమెరికా ప్రభుత్వం ఆ మొత్తాన్ని 50% కు రెట్టింపు చేసింది. ఇది మార్కెట్ ప్రతిస్పందనను తీవ్రంగా ప్రేరేపించింది.

టారిఫ్‌ల పెంపు ప్రభావం డాలర్- రూపాయి మారక విలువ క్షీణత వరకు ఆగిపోలేదు. ఇతర దేశాల కరెన్సీతో ఇండియన్‌ రూపాయి మారక విలువ పడిపోయింది.  ఆఫ్‌షోర్ చైనీస్ యువాన్‌తో పోలిస్తే, రూపాయి విలువ మరింత క్షీణించి, 12.3307 ను తాకింది. ఇది వారంలోనే 1.2%,  నెలలో 1.6% క్షీణతను సూచిస్తుంది. గత నాలుగు నెలలుగా రూపాయి మారకం విలువ యువాన్ తో పోలిస్తే దాదాపు 6 శాతం క్షీణించింది.

డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా 87.9650కి పడిపోవడం అమెరికా టారిఫ్‌ల ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. డాలతో రూపాయి మారక విలువ ఏడాది ‍కాలంలో 4.24%  పడిపోయింది. అమెరికా విధించిన భారీ టారిఫ్‌ల వల్ల పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)