వ్యవస్థలో మూలుగుతున్న రూ.2000 నోట్లు!

Published on Mon, 06/02/2025 - 15:13

రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక గణాంకాలు వెల్లడించింది. రూ.2000 నోట్లు రద్దయి రెండేళ్లు గడిచినా ఇంకా చెలామణిలో ఉన్నాయని ఆర్‌బీఐ సోమవారం విడుదల చేసిన రిపోర్ట్‌లో తెలిపింది. మే 31, 2025 వరకు ఇంకా వ్యవస్థలో రూ.6,181 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఉన్నాయని చెప్పింది. 2023 మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 98.26% మాత్రమే తిరిగి వచ్చాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.

2023 మే 19న చలామణిలో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ ప్రకటన రోజున చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్ల నుంచి 2025 మే 31 నాటికి రూ.6,181 కోట్లకు పడిపోయిందని ఆర్‌బీఐ పేర్కొంది. రూ.2000 నోట్ల రద్దు సమయంలో 2023 అక్టోబర్ 7 వరకు బ్యాంకు శాఖల్లో వీటి డిపాజిట్ లేదా మార్పిడి చేసుకునే అవకాశం ఉందని ఆర్‌బీఐ తెలిపింది. దాంతో చాలామంది వారి వద్ద ఉన్న నోట్లను సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి మార్చుకున్నారు. అప్పటికీ మార్చుకోలేనివారు ఆ తేదీ తరువాత దేశవ్యాప్తంగా ఆర్‌బీఐకు చెందిన 19 కార్యాలయాల్లో ఈ నోట్లను మార్చుకునే వీలు కల్పించింది.

ఇదీ చదవండి: నెలలో 22,315 యూనిట్లు సరఫరా

2023 అక్టోబరు 9 నుంచి ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాలు రూ.2000 నోట్లను బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి స్వీకరిస్తున్నాయి. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో 19 ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నాయి. నేరుగా వీటి ద్వారా రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. లేదా పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపవచ్చు.

Videos

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

చరిత్ర సృష్టించిన రష్మిక

DSCలో అవినీతి బట్టబయలు..! లోకేష్ రాజీనామా..?

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

Photos

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)