Breaking News

బ్యాంకులో రూ.35 కోట్లు ఖాతాదారుల సొమ్ము మాయం

Published on Wed, 10/28/2026 - 19:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) శాఖలో సుమారు రూ.35 కోట్ల భారీ కుంభకోణం వెలుగుచూడటం సంచలనం సృష్టించింది. ఖాతాదారుల పొదుపు ఖాతాలు (సేవింగ్స్ అకౌంట్స్), ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి ఎలాంటి సమాచారం సందేశాలు లేకుండానే పెద్ద ఎత్తున నిధులు అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది.

అసలేం జరిగిందంటే..

బాధిత ఖాతాదారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ బ్రాంచ్‌లో కొందరు కస్టమర్లు తమ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో మదుపు చేశారు. అయితే, వారికి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే ఆ ఎఫ్‌డీలను రద్దు చేయడం, ఆ మొత్తాన్ని ఇతర ఖాతాలకు బదలాయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఖాతాదారులు ఆందోళనకు దిగి బ్యాంకు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కొందరి ఖాతాల నుంచి రూ.10 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు డిపాజిట్లు మాయమైనట్లు ప్రాథమిక ఫిర్యాదుల్లో తేలింది.

అంతర్గత విచారణ

ఈ ఆరోపణలు బయటికి రావడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నతాధికారులు, విజిలెన్స్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ప్రాథమిక విచారణ ఆధారంగా బాధ్యులని తేలిన బ్రాంచ్ మేనేజర్‌తో సహా మొత్తం ఐదుగురు బ్యాంకు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకుంది. అంతేకాకుండా, సదరు బ్రాంచ్‌లో కొత్త సిబ్బందిని నియమించి కార్యకలాపాలను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు, స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాధిత ఖాతాదారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిధుల మళ్లింపుపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

బ్యాంక్ యాజమాన్యం భరోసా

ఖాతాదారుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు పీఎన్‌బీ మేనేజ్‌మెంట్ స్పందించింది. బ్యాంకులో డిపాజిట్ చేసిన ప్రతి రూపాయికి పూర్తి భద్రత ఉంటుందని, చట్టపరమైన విచారణ అనంతరం బాధితుల సొమ్మును పూర్తిగా తిరిగి చెల్లిస్తామని బ్యాంకు అధికారులు హామీ ఇస్తున్నారు. అయితే, దేశంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇలాంటి మోసాలు పునరావృతం కావడం డిజిటల్ భద్రత, అంతర్గత ఆడిట్ వ్యవస్థలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.

ఇదీ చదవండి: 120 కి.మీ వేగంతో వెళ్లినా చలాన్లు ఉండవు! కానీ..

Videos

భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!

హీరోగా వంగా ఇక స్క్రీన్ పై అరాచకమే

పబ్లిసిటీ ఆపి.. రైతులను ఆదుకో చంద్రబాబుకు కన్నబాబు డిమాండ్స్

దొంగ సంతకాలతో విత్ డ్రా చేశారు... మంత్రి ఆనంపై సంచలన వ్యాఖ్యలు

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

మంత్రి ఇలాకాలో టీడీపీ దౌర్జన్యం.. ఏడాదైనా మహిళకు దక్కని న్యాయం

అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ సెటైర్... సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)