Breaking News

రూ.25 లక్షల వేతనం.. బెంగళూరులో కష్టం!: పోస్ట్ వైరల్

Published on Sun, 03/23/2025 - 13:50

ఉద్యోగం చేయాలనుకునే చాలామంది.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లేదా హైదరాబాద్ వంటి నగరాలనే ఎంచుకుంటారు. అయితే బెంగళూరులో ఉండటం కష్టం అంటూ.. రూ.25 లక్షల వేతనం తీసుకునే ఓ కార్పొరేట్ ఉద్యోగి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఒక కార్పొరేట్ ఉద్యోగి 40 శాతం ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కోసం పూణే నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. అయితే ఓ సంవత్సరం గడిచాక, బెంగళూరుకు రావడం తప్పు అయిందని పశ్చాత్తాపపడ్డాడు. ఈ విషయాలు ప్రస్తుతం లింక్డ్ఇన్ పోస్ట్‌లో వైరల్ అయ్యాయి.

పూణేలో రూ. 18 లక్షల వేతనం వచ్చేది. బెంగళూరులో రూ. 25 లక్షలు వస్తున్నా ఏమీ మిగలడం లేదని, కొత్త ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి తన నిరాశను వ్యక్తం చేశాడు కార్పొరేట్ ఉద్యోగి. నగరాలు మారకూడదు, పూణే చాలా బాగుందని అన్నాడు.

ఇదీ చదవండి: వారానికి 70 గంటల పని: మొదటిసారి స్పందించిన సుధామూర్తి

కార్పొరేట్ ఉద్యోగి మాటలు విన్న, అతని ఫ్రెండ్ ఆశ్చర్యపోతూ.. 40 శాతం ఇంక్రిమెంట్ బాగానే ఉంది కదా. ఏమైంది అని అడిగితే.. బెంగళూరులో జీతాలు పెరిగేకొద్దీ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. అద్దెలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇంటి యజమానులు మూడు లేదా నాలుగు నెలల రెంట్ అడ్వాన్స్ తీసుకుంటున్నారు. ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంది.

పూణేలోని 15 రూపాయల వడాపావ్‌ మిస్ అవుతున్నా అని చెప్పాడు. కనీసం అక్కడ జీవితం, సేవింగ్స్ అన్నీ బాగున్నాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. తాము ఎదుర్కొన్న సొంత అనుభవాలను కూడా వెల్లడించారు. కొందరు బెంగళూరును సమర్దిస్తే.. మరికొందరు బెంగళూరులో బతకడం కష్టం అని అన్నారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)