Breaking News

'క్లీన్ నోట్ పాలసీ' అంటే? ఆర్బీఐ బ్యాంకులకిచ్చిన కీలక ఆదేశాలు తెలుసుకోండి!

Published on Fri, 05/19/2023 - 20:46

సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2వేల కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుని మరోసారి షాకిచ్చింది. అయితే ఇది చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతుందని తెలిపింది. 'క్లీన్ నోట్ పాలసీ' లో భాగంగానే ఈనిర్ణయం  తీసుకున్నామని ఆర్బీఐ శుక్రవారం నాటి ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు కస్టమర్లకు రూ. 2వేల నోట్లను జారీని తక్షణమే నిలిపివేయాలని  బ్యాంకులకు ఆదేశించింది.అలాగే అన్ని బ్యాంకులు సెప్టెంబర్ 30, 2023 వరకు 2,000 నోట్లకు డిపాజిట్ /లేదా మార్పిడిని అవకాశాన్ని  కల్పించాలని  కూడా  ఆదేశించింది. అలాగే  మే 23, 2023 నుండి ఏ బ్యాంక్‌లోనైనా రూ. 2000 నోట్లను ఇతర డినామినేషన్‌ల నోట్లలోకి మార్చుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది.

'క్లీన్ నోట్ పాలసీ' అంటే ఏమిటి?  
ప్రజలకు మంచి నాణ్యమైన నోట్లు అందుబాటులో ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  అనుసరించే విధానమే క్లీన్ నోట్ పాలసీ.  2016 నోట్లు రద్దు తరువాత రూ.2 వేల  నోటునుతీసు‍‍కొచ్చింది ఆర్బీఐ. అయితే ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత , 2018-19లో 2,000 నోట్ల ముద్రణ నిలిపివేసినట్టు ఆర్బీఐ  పేర్కొంది. 2017 మార్చిలో  89 శాతం  జారీ చేయగా వాటి జీవిత కాలం 4-5 సంవత్సరాల అంచనా వేసింది. 2018 మార్చి 31, నాటికి గరిష్టంగా ఉన్న రూ. 6.73 లక్షల కోట్ల (చెలామణీలో ఉన్న నోట్లలో 37.3 శాతం) మొత్తం విలువ రూ. 6.73 లక్షల కోట్ల నుంచి రూ. 3.62 లక్షల కోట్లకు తగ్గింది, ఇది కేవలం 10.8 శాతం మాత్రమే.  2016 నవంబరులో అప్పటిదాకా చలామణిలో ఉన్న పెద్ద నోట్లు  రూ. 500, 1,000 నోట్లను రద్దు చేసింది.  (Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు)

మరోవైపు రూ. 2వేల నోటు వితడడ్రా ప్రకటించిన వెంటనే ఆర్బీఐ వెబ్‌సైట్‌ క్రాష్‌ కావడం గమనార్హం.   భారీ ట్రాఫిక్‌ కారణంగా ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అవడంతో యూజర్లు ఇబ్బందులు పడ్డారు. 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)