రూ.2000 నోట్లు.. ఇంకా రూ.6,691 కోట్లు

Published on Wed, 01/01/2025 - 20:12

ఉపసంహరించిన రూ.2000 నోట్లలో ఇప్పటి వరకూ 98.12 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని, ఇంకా రూ.6,691 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్ద ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది. 2023 మే 19న ఆర్బీఐ రూ. 2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ 2023 మే 19న వ్యాపారం ముగిసే సమయానికి రూ. 3.56 లక్షల కోట్లు ఉండగా 2024 డిసెంబర్ 31న వ్యాపారం ముగిసే సమయానికి రూ.6,691 కోట్లకు తగ్గిందని ఆర్‌బీఐ తాజాగా తెలిపింది. 98.12 శాతం నోట్లు తిరిగి వచ్చాయని పేర్కొంది. రూ. 1000, రూ. 500 నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్‌లో రూ. 2000 నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టింది.

అన్ని బ్యాంక్ శాఖల్లో రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకునే లేదా మార్చుకునే సదుపాయాన్ని 2023 అక్టోబర్ 7 వరకు ఆర్బీఐ అందుబాటులో ఉంచింది. ఈ సదుపాయం ఆర్బీఐ 19 ఇష్యూ కార్యాలయాల్లో ఇప్పటికీ అందుబాటులో ఉంది. 2023 అక్టోబరు 9 నుండి ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాలు రూ. 2000 నోట్లను బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి స్వీకరిస్తున్నాయి.

అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో 19 ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నాయి. నేరుగా వీటి ద్వారా రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చు. లేదా పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపవచ్చు.

Videos

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

DSCపై లోకేష్ తో బహిరంగ చర్చకు సిద్ధం.. అభ్యర్థి సంచలన సవాల్..!

వైఎస్ జగన్ పాదయాత్ర.. తేదీ ఖరారు..!

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

Photos

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)