Rs 2000 notes withdraw: బ్యాంకులు ఈ నోట్లను తిరస్కరిస్తే ఏం చేయాలో తెలుసా?

Published on Sat, 05/20/2023 - 14:25

సాక్షి,ముంబై:   2 వేల రూపాయల నోటును రీకాల్‌ చేస్తూ  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోటును అన్ని బ్యాంకు శాఖలతో పాటు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మార్పిడి చేసుకోవచ్చని, డిపాజిట్‌ చేసుకోవచ్చని కూడా ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. దీనికి సంబంధించిన గడువు  సెప్టెంబర్ 30వ తేదీతో ముగుస్తుంది.  ఈ నేపథ్యంలో 2 వేల రూపాయల నోటు  2023  అక్టోబరు ఒకటి నుంచి చెల్లుబాటులో ఉండవు.

మే 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకుల్లో ఈ రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఒక రోజులో ఒకవ్యక్తి గరిష్టంగా రూ. 20 వేల విలువైన నోట్ల వరకు మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. అయితే డిపాజిట్ల విషయంలో ఎలాంటి పరిమితి లేదు. దీనికి సంబంధించి కీలక ఆదేశాలు బ్యాంకులకు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి: జేబులోనే పేలిన మొబైల్‌: షాకింగ్‌ వీడియో వైరల్‌

రూ. 2000 నోటు  మార్పిడికి  డిపాజిట్లకు  బ్యాంకులు నిరాకరిస్తే?
ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారంరూ. 2 వేల నోట్లను గడుపు లోపల తీసుకునేందుకు నిరాకరించవు. ఒక వేళ బ్యాంకులు నిరాకరిస్తే ఏంచేయాలనేది వినియోగదారులకుపెద్ద ప్రశ్న. రూ. 2వేల నోటును మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి బ్యాంకు నిరాకరించినట్లయితే, సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేయవచ్చు. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్‌ చేసుకోవచ్చా?)

అలాంటి అనుభవం ఎదురైతే కొత్త వన్ నేషన్, వన్ అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద నాలుగు మార్గాల్లో ఫిర్యాదును నమోదు  చేయవచ్చు.  టోల్ ఫ్రీ నంబర్ 14448కి ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:15 గంటల మధ్య కాల్ చేయవచ్చు. అలాగే ఆర్బీఐకి ఈ ఇమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.  లేదంటే సెంట్రలైజ్డ్ రసీదు అండ్‌  ప్రాసెసింగ్ సెంటర్', రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4వ అంతస్తు, సెక్టార్ 17, చండీగఢ్ - 160017 అనే చిరునామాకు పోస్ట్ ద్వారా భౌతిక ఫిర్యాదును పంపవచ్చు.

Videos

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

DSCపై లోకేష్ తో బహిరంగ చర్చకు సిద్ధం.. అభ్యర్థి సంచలన సవాల్..!

వైఎస్ జగన్ పాదయాత్ర.. తేదీ ఖరారు..!

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

Photos

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)