నెలకు రూ.2 లక్షల జీతం చాలా డేంజర్‌ అంటున్న టెకీ..

Published on Wed, 09/02/2026 - 19:34

నెలకు రూ.2 లక్షల జీతం వస్తే.. ఇంకేం కావాలి.. ఇక జీవితానికి తిరుగులేదని చాలామంది భావిస్తారు. కానీ బెంగళూరుకు చెందిన టెక్‌ ప్రొఫెషనల్‌ శశాంక్‌ దీక్షిత్‌ మాత్రం ఇదే ఆదాయం ఒక దశలో కెరీర్‌కు ‘డేంజర్‌’గా మారొచ్చంటున్నారు. ఆయన చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌ ప్రస్తుతం ఉద్యోగ నెటిజన్లలో విస్తృత చర్చకు దారితీసింది.

జీతం ఎక్కువ కావడం సమస్య కాదు..

శశాంక్‌ దీక్షిత్‌ వాదన ప్రకారం.. నెలకు రూ.2 లక్షలు సంపాదించడం ప్రమాదకరమని చెప్పడానికి కారణం ఆ మొత్తం ఎక్కువగా ఉండటం కాదు. ‘జస్ట్‌ ఎనఫ్‌’గా అనిపించడం అసలు సమస్య. ఈ స్థాయి ఆదాయం ఒక వ్యక్తికి మంచి జీవనశైలిని అందించడంతో పాటు, ప్రస్తుత ఉద్యోగం, కెరీర్‌ గురించి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదనే భావనను కలిగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

తల్లిదండ్రులకు ‘బాగానే సంపాదిస్తున్నా’ అని చెప్పడానికి, వారాంతాల్లో హాయిగా గడపడానికి, రోజువారీ ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ ఆదాయం సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఒక దశలో ఉద్యోగి తన సామర్థ్యాన్ని పెంచుకోవడం కంటే.. ప్రస్తుత జీతాన్ని కాపాడుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందని వివరించారు.

జీతమే గుర్తింపుగా మారితే..

దీక్షిత్‌ చెప్పిన మరో కీలక అంశం ‘కంఫర్ట్‌ జోన్‌’. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం అలవాటైన తర్వాత ఉద్యోగం వదిలి స్టార్టప్‌ ప్రారంభించడం, కెరీర్‌ మార్చుకోవడం లేదా తక్కువ జీతంతో కొత్త అవకాశాన్ని ఎంచుకోవడం రిస్క్‌గా కనిపిస్తుంది.

‘ఇప్పటికే కోల్పోవడానికి ఏదో ఉంది’ అనే ఆలోచన అక్కడ మొదలవుతుందని ఆయన అంటున్నారు. ఫలితంగా ఒకప్పుడు చేయాలనుకున్న పనులను ‘వచ్చే నెల’, ‘వచ్చే ఏడాది’ అంటూ వాయిదా వేసుకుంటూ వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు. చివరకు ఆశయం పోయిందని కాదు.. దాన్ని పట్టించుకోనంతగా సంపాదించడం మొదలుపెట్టామని గ్రహించే పరిస్థితి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు

దీక్షిత్‌ పోస్ట్‌కు పలువురు ఉద్యోగులు మద్దతు తెలిపారు. మంచి జీతం కొన్నిసార్లు ‘బంగారు పంజరం’లా మారుతుందని, సౌకర్యాన్ని వదులుకోవడం కష్టమవుతుందని కొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. మరికొందరు మాత్రం రూ.2 లక్షల జీతాన్ని సమస్యగా చూడటం సరికాదని అన్నారు.

ఇదీ చదవండి: యాపిల్‌ కొత్త సీఈవో వచ్చేశారు.. ఎంత భారీ జీతమో తెలుసా?

ఒక యూజర్‌ ప్రకారం.. అసలు ప్రమాదం రూ.2 లక్షల ఆదాయం కాదు; నెలకు రూ.2 లక్షలు ఖర్చు చేసే జీవనశైలి ఏర్పడటమే. ఆదాయం పెరిగిన కొద్దీ ఖర్చులు, రుణాలు, కుటుంబ బాధ్యతలు పెరిగితే ఉద్యోగాన్ని వదిలే స్వేచ్ఛ తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఇదే సమస్య అధిక ఆదాయం ఉన్నవారికీ ఎదురవుతుందని మరొకరు వ్యాఖ్యానించారు.

Videos

వరదకు ఎదురీది.. ప్రాణం కాపాడిన యువకుడు

మా వెనుక శేఖర్ మాస్టర్.. సుమలత మాకు అవసరం లేదు, మాకు రఘు మాస్టర్ బెస్ట్

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్

దొంగతనం ఒప్పుకోమంటూ..! పోలీసుల వేధింపులపై అర్చకుడి తల్లి కన్నీళ్లు

నేనూ సీఎం అవుతా టైం వస్తే అన్నీ అవే వస్తాయి

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)