Breaking News

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్ బైక్‌ ఆవిష్కరణకు డేట్‌ ఫిక్స్‌

Published on Wed, 11/05/2025 - 10:39

ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేస్తోంది. కంపెనీ సీఈఓ బి.గోవిందరాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం కంపెనీ 2026లో తమ మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈమేరకు ఇటలీలో జరిగిన ఈఐసీఎంఏ 2025లో ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా గోవిందరాజన్ మాట్లాడుతూ..‘మేము 2026లో మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ బైక్‌ను తీసుకొస్తున్నాం. మొదట ఫ్లయింగ్ ఫ్లీ C6 పేరుతో కొత్త మోడల్‌ను ఆవిష్కరిస్తాం. తర్వాత ఫ్లయింగ్ ఫ్లీS6 మార్కెట్‌లోకి వస్తుంది. అయితే మొదట ఈ బైక్‌లు యూరప్‌లో అందుబాటులోకి వస్తాయి. తర్వాత కొద్ది రోజులకు భారత వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి’ అని చెప్పారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం ఫ్లయింగ్ ఫ్లీ అనే బ్రాండ్‌తో మార్కెట్‌లోకి రానుంది. కంపెనీ రెండో ప్రపంచ యుద్ధం నాటి తేలికపాటి మోటార్ సైకిళ్ల నుంచి ప్రేరణ పొంది వీటిని డిజైన్‌ చేస్తున్నట్లు ఇదివరకే తెలిపింది. అయితే ఈ మోడళ్లను ఏ ధరకు అందుబాటులోకి తీసుకురానున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: టాటా ట్రస్ట్‌లో ఆధిపత్య పోరు ముగిసినట్లేనా?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)