Breaking News

వచ్చేసింది.. ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు విడుదల చేసిన రోల్స్ రాయిస్

Published on Sun, 06/18/2023 - 13:50

భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి సన్నద్ధమయ్యాయి, అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసిన 'రోల్స్ రాయిస్' (Rolls Royce) కూడా 'స్పెక్టర్' అనే ఎలక్ట్రిక్ కారు విడుదలతో ఈ జాబితాలో చేరింది.

ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసిన రోల్స్ రాయిస్ కంపెనీ తాజాగా 'స్పెక్టర్' (Spectre) ఎలక్ట్రిక్ కారుని సౌత్ కొరియాలో విడుదల చేసింది. గతంలో వెల్లడించినట్లుగానే కంపెనీ ఎలక్ట్రిక్ కారుని తీసుకువచ్చింది. ఇది గ్లోబల్ మార్కెట్లో కంపెనీ విడుదల చేసిన మొదటి ఎలక్ట్రిక్ మోడల్. దీని ధర కొరియాలో 620 మిలియన్ వాన్స్.. అంటే భారతీయ కరెన్సీ దీని విలువ సుమారు 3.98 కోట్లు.

(ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్.. నితిన్ గడ్కరీ జీ అంటూ..!!)

దక్షిణ కొరియాలో రోల్స్ రాయిస్ తన ఉనికిని మరింత విస్తరించుకోవడంలో భాగంగానే స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసినట్లు సమాచారం. ఈ కారు డిజైన్ చూడగానే రోల్స్ రాయిస్ తెలిసిపోతుంది. ఇందులో అత్యంత విశాలవంతమైన గ్రిల్ చూడవచ్చు. పరిమాణం పరంగా ఇది చాలా విషయంగా ఉంటుంది. పొడవు 5,453 మిమీ పొడవు, 2,080 మిమీ వెడల్పు, ఎత్తు 1,559 మిమీ వరకు ఉంది. వీల్‌బేస్ 3210 మిమీ. ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టర్ 2,950 కేజీల కంటే ఎక్కువ బరువును కలిగి.. రెండు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా 576.6 bhp పవర్, 900 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. ఇది ఒక ఛార్జ్‌తో గరిష్టంగా 520 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు