Breaking News

పట్టాలు కాదు.. పనిలో నైపుణ్యం కావాలి

Published on Sat, 11/01/2025 - 05:44

న్యూఢిల్లీ: టెక్నాలజీ పరంగా వేగవంతమైన పరివర్తన నేపథ్యంలో రాణించేందుకు కావాల్సిన నైపుణ్యాలు, పోటీతత్వంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నట్టు టాగ్డ్‌ సీఈవో దేవాశిష్‌ శర్మ తెలిపారు. సంప్రదాయ డిగ్రీలకు బదులు సంభాషణ నైపుణ్యాలు, క్రిటికల్‌ థింకింగ్‌ వంటి సాఫ్ట్‌ స్కిల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతున్నట్టు చెప్పారు. మారుతున్న వాతావరణం నేపథ్యంలో యాజమాన్యాలు ప్రత్యక్ష నైపుణ్యాలు, అప్పగించిన పనిని వేగంగా చేయగలిగే సామర్థ్యాలను అభ్యర్థుల్లో చూస్తున్నట్టు తెలిపారు. 

సంభాషణ, క్రిటికల్‌ థింకింగ్, సమస్యల పరిష్కారం, సృజనాత్మకత, ఉద్యోగం చేయడానికి సన్నద్ధతపై ఉద్యోగార్థులు దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. డేటా ఆధారిత సామర్థ్యాల గుర్తింపు, ఇంటర్న్‌షిప్‌లు, చేపట్టిన ప్రాజెక్టుల ఆధారంగా వారి సన్నద్ధతను యాజమాన్యాలు పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యా సంస్థలతో కలసి కరిక్యులమ్‌ రూపొందించడం, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై యాజమాన్యాలు దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. 

ముఖ్యంగా నైపుణ్యాల కొరత నేపథ్యంలో విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య సహకారం, సమన్వయంతో గ్రాడ్యుయేట్లు పని ప్రదేశాల్లో రాణించేందుకు కావాల్సిన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం సాధ్యపడుతుందన్నారు. ఐఐటీ ఢిల్లీలో ఐఎన్‌ఏఈ–ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ సెంటర్‌ ఫర్‌ ఇంజనీరింగ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఏర్పాటు.. పరిశోధన, ఆవిష్కరణలపై ఐఐటీ హైదరాబాద్‌–రెనెసెస్‌ మధ్య భాగస్వామ్యాలను శర్మ ప్రస్తావించారు. ప్రభుత్వం సైతం ఉద్యోగ అర్హతలను మెరుగుపరచడంపై దృష్టి సారించిందని.. నేషనల్‌ అప్రెంటిస్‌íÙప్‌ ప్రమోషన్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టిందని చెప్పారు. దీని కింద 2023–24లో 9.3 లక్షల అభ్యర్థులను చేరుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి 46 లక్షల మంది అప్రెంటిస్‌íÙప్‌ల లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)