Breaking News

లగ్జరీ ఇల్లు, కారు.. ఏవి ధనవంతుల ఆస్తులు?

Published on Sun, 06/07/2026 - 14:21

పాపులర్‌ పర్సనల్‌ ఫైనాన్స్‌ పుస్తకం రిచ్‌ ‘డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) రచయిత, ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ గురూ రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) ఆస్తులు (Assets), అప్పులు (Liabilities) మధ్య తేడాను అర్థం చేసుకోవడమే నిజమైన సంపదకు తొలి మెట్టు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టు విస్తృత చర్చకు దారి తీసింది.

చాలామంది ఖర్చుతో కూడుకున్న వస్తువులను సంపదగా భావిస్తారని, అయితే అధిక ధర ఉన్నంత మాత్రాన అది ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తి కాదని కియోసాకి వివరించారు. ప్రతి నెలా మన జేబులోకి డబ్బు వస్తే అది ఆస్తి, జేబులో నుంచి డబ్బు వెళ్తే అది అప్పు అని ఆయన సరళమైన నిర్వచనం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఖరీదైన ఇల్లు, విలాసవంతమైన కారు వంటి వాటిని ఉదాహరణగా చూపించారు. ఇంటికి గృహ రుణం, పన్నులు, బీమా, నిర్వహణ ఖర్చులు ఉంటాయని, కారు కొనుగోలు చేసిన వెంటనే విలువ తగ్గడం ప్రారంభమవుతుందని తెలిపారు. అందువల్ల ఇవి ఎక్కువగా అప్పుల కిందకే వస్తాయని పేర్కొన్నారు.

మరోవైపు అద్దె ఆదాయం వచ్చే రియల్‌ ఎస్టేట్‌, డివిడెండ్‌లు చెల్లించే షేర్లు, లాభాలు ఆర్జించే వ్యాపారాలు, రాయల్టీలు తెచ్చిపెట్టే మేధో సంపత్తి హక్కులు, డిజిటల్‌ ఉత్పత్తులు వంటి వాటిని నిజమైన ఆస్తులుగా అభివర్ణించారు. ఇవి నిరంతరం నగదు ప్రవాహాన్ని సృష్టించి యజమానికి ఆదాయం అందిస్తాయని చెప్పారు.

సంపన్నులు ముందుగా ఆస్తులను కొనుగోలు చేస్తారని, మధ్యతరగతి ప్రజలు ముందుగా అప్పులను పెంచుకుని తర్వాత ఆర్థిక స్వేచ్ఛ ఎందుకు రాలేదని ఆశ్చర్యపడుతుంటారని కియోసాకి వ్యాఖ్యానించారు. పాఠశాలలు, ఆర్థిక వ్యవహారాలపై సలహాలు ఇచ్చే అనేక మంది కూడా ఈ మౌలిక సూత్రాన్ని బోధించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికన్‌ డ్రీమ్‌ అంటే పెద్ద ఇల్లు కాదని, ఆర్థిక స్వేచ్ఛేనని కియోసాకి పేర్కొన్నారు. ప్రతి నెలా ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తులను సృష్టించుకోవడం ద్వారానే నిజమైన స్వేచ్ఛ సాధ్యమవుతుందని తన పోస్టులో స్పష్టం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)