Breaking News

మార్కెట్‌ మరింత పడుతుంది.. బంగారం, వెండి కొనడమే మేలు

Published on Sat, 04/19/2025 - 18:51

రాబోయే ఆర్థిక మాంద్యం గురించి చాలామంది తీవ్ర ఆందోళనలు చెందుతున్న వేళ.. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఓ సుదీర్ఘ ట్వీట్ చేసారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి.. కీలకమైన పెట్టుబడి సలహాలను సైతం పంచుకున్నారు.

2025లో క్రెడిట్ కార్డ్ అప్పులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిరుద్యోగం పెరుగుతోంది.. దీనివల్ల నాలుగు లక్షల కంటే ఎక్కువమంది నష్టపోయె అవకాశం ఉంది. అమెరికా తీవ్రమైన ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తోందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. అంతే కాకుండా.. అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం రాబోతుందని గతంలోనే నేను వెల్లడించారు. అది ఇప్పుడు నిజమైందని అన్నారు.

నిజానికి.. ఫేక్, హూ స్టోల్ మై పెన్షన్, రిచ్ డాడ్ పూర్ డాడ్ వంటి నేను రాసిన చాలా పుస్తకాలలో రాబోయే ఆర్థిక విపత్తు గురించి హెచ్చరించారు. నా హెచ్చరికలను పాటించిన వ్యక్తులు నేడు బాగానే ఉన్నారు. అలా చేయని వారి గురించి నేను ఆందోళన చెందుతున్నానని కియోసాకి అన్నారు.

శుభవార్త ఏమిటంటే మీరు ఇప్పుడు కూడా బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిని కొనుగోలు చేస్తే ధనవంతులు అవుతారు. ఆలస్యం చేస్తే.. స్టాక్ మార్కెట్ మరింత పతనం కావొచ్చు, బంగారం ధరలు ఇంకా పెరగవచ్చు. కాబట్టి కేవలం ఒక బిట్‌కాయిన్ లేదా కొంత బంగారం లేదా వెండిలో పెట్టుబడి పెట్టే వారు ఈ సంక్షోభం నుంచి బయటపడవచ్చు, ధనవంతులుగా మారవచ్చు.

పేదలు పేదలుగానే ఉండటానికి కారణం ఏమిటంటే.. నేను దానిని భరించలేను, నేను ప్రయత్నిస్తాను, నేను వేచి ఉంటాను అనే ఆలోచనలే. ఒక పేదవాడు కొన్ని ఔన్సుల బంగారం లేదా వెండి లేదా ఒక బిట్‌కాయిన్‌లో 1/2 వంతు కొనుగోలు చేస్తే.. ఈ ఆర్థిక మాంద్యం ముగిసిన తర్వాత వారు కొత్త ధనవంతులు అవుతారని నేను అంచనా వేస్తున్నానని రాబర్ట్ కియోసాకి అన్నారు.

2035 నాటికి.. ఒక బిట్‌కాయిన్ ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. బంగారం, వెండి ధరలు కూడా ఊహకందని రీతిలో ఉంటాయని అన్నారు. భయంతో వేచి ఉన్నవారే.. నష్టాలను చూస్తారు. రాబోయే మాంద్యం లక్షలాది మందిని పేదలుగా చేస్తుంది.

నేను ఊహించిన భారీ పతనం.. ఇప్పుడు జరుగుతున్న క్రాష్. ఇది మీ జీవిత కాలంలో గొప్ప సంపదను సాధించడానికి, మరింత ముఖ్యంగా ఆర్థిక స్వేచ్ఛను పొందడానికి అవకాశం కావచ్చు. దయచేసి ఈ భారీ క్రాష్‌ను వృధా చేయకండి. జాగ్రత్తగా ఉండండి, బెస్ట్ ఆఫ్ లక్ అని రాబర్ట్ కియోసాకి ట్వీట్ ముగించారు.

 Note: బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం అనేది మీ సొంత ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా.. పెట్టుబడుల విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి. నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)