Breaking News

వ్యాక్సిన్‌ వ్యతిరేకితో భారత్‌కు నష్టం?

Published on Sat, 11/16/2024 - 10:01

అమెరికా అధ్యక్షపీఠాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అధిరోహించనున్నారు. ఇప్పటికే తన వద్ద పనిచేసే మంత్రులను నియమిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఆరోగ్య, ప్రజా సేవల మంత్రిగా వ్యాక్సిన్‌ వ్యతిరేక ఉద్యమకారుడు రాబర్ట్‌ ఎఫ్‌ కెనెడీ జూనియర్‌ను నియమించనున్నట్లు ప్రకటించారు. అయితే ఇందుకు సెనెట్‌లో ఆమోదం లభించాల్సి ఉంటుంది. అమెరికాకు అత్యధికంగా భారత ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ తరుణంలో కెనెడీ నియామకం పట్ల భారత కంపెనీలు కొంత ఆందోళన చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

‘ప్రజారోగ్యం విషయంలో మందుల కంపెనీల మోసాలు, తప్పుడు సమాచారం తదితరాలతో అమెరికన్లు చాలాకాలంగా నలిగిపోయారు. కెనెడీ వీటికి అడ్డుకట్ట వేసి అమెరికాను మళ్లీ గొప్పగా, ఆరోగ్యంగా మారుస్తారు. ఔషధాలు, వ్యాక్సిన్లు, ఆహార భద్రత, వైద్య పరిశోధన, సామాజిక భద్రత, మెడికేర్‌ వంటి కీలక వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు’ అని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా హాండిల్‌ ట్రూత్‌లో పోస్ట్‌ చేశారు.

2023 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ దాదాపు 7.55 బిలియన్‌ డాలర్లు (రూ.62,615 కోట్లు) విలువ చేసే ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. యాంటిసెరా, వ్యాక్సిన్‌లు, టాక్సిన్‌లు, గ్రంథులు.. వంటి వాటిని ఎగుమతి చేస్తున్నారు. అమెరికాకు ఎగుమతి చేసే దేశీయ కంపెనీల్లో ప్రధానంగా సన్ ఫార్మాస్యూటికల్స్, సిప్లా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, లుపిన్ లిమిటెడ్.. వంటి కంపెనీలున్నాయి. వీటితోపాటు ప్రధానంగా కరోనా సమయం నుంచి ‘వ్యాక్సిన్‌ మైత్రి’లో భాగంగా దేశీయంగా తయారైన కొవాక్సిన్‌, కొవిషీల్డ్‌ వంటి వ్యాక్సిన్లు అమెరికాకు భారీగా ఎగుమతి చేస్తున్నారు. ఆరోగ్య మంత్రిగా వ్యాక్సిన్‌ వ్యతిరేకిగా ఉన్న కెనెడీ నియామకం ఫార్మా కంపెనీల్లో కొంత ఆందోళన కలిగిస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రియల్టీ జోరు!

‘మేక్‌ అమెరికా హెల్దీ అగైన్‌’ నినాదానికి కెనెడీ పూర్తిగా న్యాయం చేస్తారని ట్రంప్‌ విశ్వాసం వెలిబుచ్చారు. తన రెండో విడత పాలనలో ప్రజారోగ్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కెనెడీకి పూర్తి స్వేచ్ఛనిస్తానని ట్రంప్‌ పదేపదే చెప్పుకొచ్చారు. టీకాలు తదితరాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తికి ఏకంగా ఆరోగ్య శాఖ అప్పగించడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, నిబంధనల ప్రకారం యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అ‍డ్మినిస్ట్రేషన్‌(యూఎస్‌ ఎఫ్‌డీఏ) ధ్రువపరిచిన ఫార్మా ఉత్పత్తుల ఎగుమతికి ఎలాంటి ఢోకా లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు.

Videos

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు