Breaking News

రాయికి రంగేసి రూ.5 వేలకు అ‍మ్మాడు.. కానీ..

Published on Wed, 12/03/2025 - 18:34

నేటి యువతరం కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా, సంపాదన కోసం తమదైన మార్గాన్ని సృష్టించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒక చిన్న ఆలోచన, కొంచెం సృజనాత్మకత ఉంటే.. సాధారణ వస్తువులను కూడా అద్భుతమైన బిజినెస్ అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో కొందరు నిరూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఓ యువకుడు చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసిన ఓ వీడియా వైరల్‌గా మారింది.

రోడ్డు పక్కన రాయి.. రూ.5,000 గడియారంగా!

సాధారణంగా రోడ్డు పక్కన పడి ఉండే రాళ్లను ఎవరు పట్టించుకుంటారు? కానీ, ఢిల్లీకి చెందిన ఒక యువకుడు అదే రాయిని అత్యంత ఆకర్షణీయమైన ఫంక్షనల్ గడియారంగా మార్చి రూ.5,000కు అమ్మి అందరి దృష్టిని ఆకర్షించాడు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియో ప్రకారం.. ఈ యువకుడు రోడ్డు పక్కనుంచి తీసుకున్న ఒక సాధారణ రాయిని ప్రత్యేకమైన షోపీస్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాడు. మొదట రాయిని కావలసిన ఆకారంలో కత్తిరించి, ఆపై పాలిషింగ్, పెయింటింగ్ చేశాడు. దీంతో రాయికి నిగనిగలాడే ఫినిషింగ్ వచ్చింది. తర్వాత లోపల ఒక చిన్న గడియారాన్ని జాగ్రత్తగా అమర్చి దాన్ని అలంకార వస్తువుగా మార్చేశాడు.

మొదట ఆకర్షణీయంగా లేకపోవడంతో..

వీడియోలోని వివరాల ప్రకారం.. మొదటి ప్రయత్నంలో గడియారం వెనుక భాగం అంతగా ఆకర్షణీయంగా లేకపోవడంతో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, ఈ యువకుడు నిరాశ చెందకుండా వెంటనే దాన్ని సరిదిద్ది వెనుక భాగాన్ని చక్కటి కవర్‌తో కప్పి ఆకర్షణీయంగా చేశాడు. దాంతో ఒక కస్టమర్ వెంటనే రూ.5,000 చెల్లించి దాన్ని కొనుగోలు చేశాడు.

ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!

Videos

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)