Breaking News

‘ఆర్‌కామ్‌’తో సంబంధం లేదు: అంబానీ కంపెనీలు

Published on Fri, 07/04/2025 - 18:11

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) ఖాతాను ఫ్రాడ్‌ అకౌంటుగా ఎస్‌బీఐ వర్గీకరించడమనేది తమ వ్యాపారాలపై ఎలాంటి ప్రభావమూ చూపదని అనిల్‌ ధీరుభాయ్‌ అంబానీ గ్రూప్‌లో (అడాగ్‌) భాగమైన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్‌ పవర్‌ స్పష్టం చేశాయి. ఆర్‌కామ్‌తో తమకెలాంటి వ్యాపార, ఆర్థిక సంబంధాలు లేవని, తమ రెండు సంస్థలు వేర్వేరుగా లిస్టెడ్‌ కంపెనీలుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు విడివిడిగా తెలిపాయి.

ఈ నేపథ్యంలో ఆర్‌కామ్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా తమ గవర్నెన్స్, మేనేజ్‌మెంట్, కార్యకలాపాలు, ఉద్యోగులు, షేర్‌హోల్డర్లపై ఎలాంటి ప్రభావమూ ఉండదని వివరించాయి. రుణాల మళ్లింపు ఆరోపణలతో ఆర్‌కామ్‌ ఖాతాను ఫ్రాడ్‌ అకౌంటుగా వర్గీకరించాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఎస్‌బీఐ స్టాక్‌ ఎక్ఛేంజ్‌ ఫైలింగ్‌ ప్రకారం.. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కి ఇచ్చిన రుణాల్లో నిబంధనల ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం వంటి అంశాలు కనిపించాయని పేర్కొంది. మొత్తం రూ.31,580 కోట్ల రుణాల్లో సుమారు రూ.13,667 కోట్లు ఇతర రుణాల చెల్లింపులకు, రూ.12,692 కోట్లు సంబంధిత సంస్థలకు మళ్లించారని తెలిపింది.

Videos

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)