Breaking News

ఓలా టెక్నాలజీ అదిరింది..హెల్మెట్‌ లేకపోతే బండి స్టార్ట్‌ కాదు!

Published on Tue, 06/20/2023 - 17:41

జుట్టు ఊడిపోతుందని, సిగ్నల్‌ జంప్‌ చేసినా ఎవరూ పట్టించుకోరనే ధీమాతో హెల్మెట్‌ పెట్టుకోకుండా ఎలక్ట్రిక్‌  బైక్‌లను నడుపుతున్నారా? కానీ రానున్న రోజుల్లో అలా సాధ్యం కాదు. ఎందుకంటే? హద్దులు చెరిపేస్తున్న టెక్నాలజీ!! హెల్మెట్‌ పెట్టుకోకుండా వాహననాన్ని నడిపే వాళ్ల భరతం పట్టనుంది. ఎలా అంటారా? 

దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్‌ బైక్‌ల తయారీ సంస్థ ఓలా కొత్త టెక్నాలజీపై పనిచేస్తున్నట్లు తెలిపింది. హెల్మెట్‌ లేని కారణంగా రోజురోజుకీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల్ని నివారించేలా అధునాతమైన సాంకేతికతను ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌లలో ఉపయోగించనుంది.

ఇందుకోసం వాహనదారులు హెల్మెట్‌ పెట్టుకున్నారా? హెల్మెట్‌ పెట్టుకోకుండా డ్రైవింగ్‌ చేస్తున్నారా? అని గుర్తించేలా కెమెరాలను అమర్చనుంది. ఈ కెమెరాలు హెల్మెట్‌ పెట్టుకోకుండా డ్రైవింగ్‌ చేస్తున్న వాహనదారుల సమాచారాన్ని వెహికల్‌ కంట్రోల్‌ యూనిట్‌ (వీసీయూ)కు అందిస్తుంది. వెంటనే వీసీయూ విభాగం మోటర్‌ కంట్రోల్‌ యూనిట్‌కు చేరవేస్తుంది. అప్పుడు మోటర్‌ కంట్రోల్‌ యూనిట్‌ మీరు హెల్మెట్‌ లేకుండా డ్రైవింగ్‌ చేస్తుంటే ఆటోమెటిగ్గా బండి ఆగిపోనుందంటూ ప్రముఖ ఆటోమొబైల్‌ బ్లాగ్‌ ఆటోకార్‌ కార్‌ ఇండియా నివేదికను విడుదల చేసింది. 

ఈ విధంగా, రైడర్ హెల్మెట్ ధరించలేదని సిస్టమ్ గుర్తిస్తే, ఓలా స్కూటర్లు ఆటోమేటిక్‌గా పార్క్ మోడ్‌కి మారుతాయి. పార్క్ మోడ్‌లో ఒకసారి, హెల్మెట్ ధరించమని రైడర్‌కు గుర్తు చేయడానికి డాష్‌పై నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత, రైడర్ హెల్మెట్ ధరించినట్లు గుర్తిస్తేనే స్కూటర్ రైడ్ మోడ్‌కి మారుతుంది. తరువాత, సిస్టమ్ రైడర్‌ను పర్యవేక్షించడాన్ని కొనసాగిస్తుందని నివేదికలో పేర్కొంది. 

ఈ సాంకేతికతను వినియోగిస్తున్న ఆటోమొబైల్‌ సంస్థల్లో ఓలాతో పాటు, కెమెరా ఆధారిత హెల్మెట్ రిమైండర్ సిస్టమ్‌ను రూపొందించడానికి కృషి చేస్తున్నట్లు టీవీఎస్ ఇటీవల ప్రకటించింది. అయితే, హెల్మెట్ లేకుండా వాహనదారుడు ప్రయాణించకుండా ఆపేలా టెక్నాలజీని వినియోగంలో ఓలా మరో అడుగు ముందుకు వేసింది.

టీవీఎస్‌ హెల్మెట్ ధరించమని గుర్తుచేసే హెచ్చరిక సందేశం మాత్రమే రైడర్‌లకు కనిపిస్తుందని, డ్రైవర్ హెల్మెట్ ధరించని సందర్భాల్లో స్కూటర్‌ను పార్క్ మోడ్‌లో ఉంచడం గురించి టీవీఎస్‌ పనిచేస్తుందా? లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదని ఏసీఐ వెల్లడించింది.

చదవండి👉 ‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’!

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)