Breaking News

తల్లి పనిమనిషి, కూలీపనులు చేసిన కొడుకు.. ఇప్పుడు ముఖేష్ అంబానీకంటే..

Published on Fri, 09/15/2023 - 10:21

'సక్సెస్'.. ఈ పదం రాసుకోవడానికి చిన్నగా ఉన్నా.. సాధించడానికి చాలా సమయం పడుతుంది. అహర్నిశలు అంకిత భావంతో పనిచేస్తేనే విజయం వరిస్తుంది. ఈ కోవకు చెందిన ఒక వ్యక్తి గురించి మనం ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

బెంగుళూరుకు చెందిన బిలియనీర్ బార్బర్ 'రమేష్ బాబు' అంటే ఈ రోజు అందరికి తెలుసు. ముఖేష్ అంబానీ కంటే కూడా ఎక్కువ కార్లను కలిగి ఉన్న ఈయన ప్రస్తుతం ధనవంతుల జాబితాలో ఒకరు. అయితే ఈయన బాల్యం కడలిలో మునిగిన నావలాంటిదని బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు.

చిన్నప్పుడే తండ్రి మరణం..
చిన్న తనంలోనే తండ్రిని కోల్పోవడంతో క్వారికున్న బార్బర్ షాప్ అక్కడితో ఆగింది. తల్లి పనిమనిషిగా చేరింది, రమేష్ బాబు తల్లికి సహాయంగా ఉండాలని కూలిపనులు చేసేవాడు. తండ్రి మరణంతో ఒక్కసారిగా కటిక పేదరికంలో పడిపోయారు. మూడు పూటల ఆహరం కోసం కూడా చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఆ తరువాత తండ్రి మార్గంలో నడవాలని నిర్ణయించుకుని మళ్ళీ బార్బర్ షాప్ ప్రారంభించాడు.

తండ్రి బార్బర్ షాప్ ప్రారభించిన అతి తక్కువ కాలంలో వృద్ధిలోకి రావడం ప్రారంభమైంది. బార్బర్‌షాప్‌ను స్టైలిష్ హెయిర్ సెలూన్‌గా మార్చాడు. రమేష్ బాబుకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అంతే కాకుండా తన వ్యాపారాన్ని వివిధ మార్గాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుని కార్లను అద్దెకివ్వాలని నిర్ణయించుకుని మొదటి మారుతి ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేశారు.

ట్రావెల్ కంపెనీ..
1994లో ప్రారంభమైన ఈ బిజినెస్ ఆ తరువాత ట్రావెల్ కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం ఈయన వద్ద సుమారు 400కంటే ఎక్కువ కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో మెర్సిడెస్ ఈ క్లాస్ సెడాన్, బీఎండబ్ల్యూ, రోల్స్ రాయిస్ ఘోస్ట్, జాగ్వార్, మెర్సిడెస్ మేబ్యాక్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. రమేష్ బాబు కార్ రెంటల్ కంపెనీలో 300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం.. వందలాది ఉద్యోగులపై ఎఫెక్ట్!

రమేష్ బాబు బిలినీయర్ అయినప్పటికీ తన మూలలను మాత్రం మరచిపోలేదు, దీంతో ఈయన అప్పుడప్పుడు సెలూన్‌కి చాలా సమయం వెచ్చిస్తాడు. మొత్తం మీద భారతదేశంలో బిలియనీర్లైన ముఖేష్ అంబానీ (సుమారు 168 కార్లు), గౌతమ్ అదానీ (10అల్ట్రా లగ్జరీ కార్లు) కంటే ఎక్కువ కార్లను కలిగిన సంపన్నుడిగా రికార్డ్ సృష్టించాడు. కాగా ప్రస్తుతం రమేష్ బాబు నికర ఆస్తుల విలువ రూ. 1200కోట్లు అని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)