Breaking News

సిల్వర్‌ సెంచరీ.. ‘రిచ్‌ డాడ్‌’ హ్యపీ

Published on Sat, 01/24/2026 - 14:41

వెండి ధరలు రోజుకో రికార్డ్‌ కొడుతూ దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా ఔన్స్‌ సిల్వర్‌ 100 డాలర్ల మార్క్‌ను దాటేసింది. వెండి ధరలపై నిరంతరం పోస్టులు పెడుతూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉండే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి అంతకు ముందే వెండి ధర 100 డాలర్లకు చేరువ కాగానే ఆనందంతో పోస్టు పెట్టారు.

‘వెండి 100 డాలర్లు (ఔన్స్‌కు) దాటుతోంది.. యేయ్‌’ అంటూ తన ‘ఎక్స్‌’ ఖాతాలో ట్వీట్‌ చేశారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, ఫియాట్ కరెన్సీలపై నమ్మకం తగ్గడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి హార్డ్ అసెట్లకు కియోసాకి ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్నారు.

ఒకవైపు విలువైన లోహంగా, మరోవైపు పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించే లోహం కావడం వల్ల వెండికి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో వినియోగం వెండి భవిష్యత్తుపై ఆశలు పెంచుతోంది. అయితే, విశ్లేషకులు వెండి ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతాయని, ఇది అత్యంత అస్థిరమైన లోహాల్లో ఒకటని హెచ్చరిస్తున్నారు.

అయితే ధరల మార్పులపై దృష్టి పెట్టకుండా, తాను బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులతో పాటు బిట్‌కాయిన్, ఎథీరియమ్ వంటి డిజిటల్ ఆస్తులను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నానని తన ఇంతకు ముందు పోస్ట్‌లో కియోసాకి తెలిపారు.
 

Videos

జగనన్న పథకాలన్నీ చోరీ చేసి..దొంగ నాటకాలు... నాగార్జున యాదవ్ ఫైర్

బొగ్గు కుంభకోణంపై భట్టికి హరీశ్ రావు మాస్ కౌంటర్

కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలతో ఆటలాడుతున్నాయి: రామచందర్ రావు

నాంపల్లి ప్రమాదానికి కారణం అదే

Khammam: జెండా పాటకు విరుద్ధంగా కొనుగోలు భగ్గుమన్న మిర్చి రైతులు

RK Roja : మరుగుదొడ్లపై ఫోటోలు వేసుకునే మీరా జగన్ గురించి మాట్లాడేది

జపాన్ లో పెరిగిన వృద్ధాప్య రేటు భారీగా ఉపాధి అవకాశాలు..!

Nampally: ఘోర అగ్నిప్రమాదం..రంగంలోకి దిగిన రోబో

యూనివర్సిటీలో విద్యార్థులను బెదిరించి లోకేష్ పుట్టినరోజు వేడుకలు

54 ఎకరాలు ఖరీదైన భూమి అప్పనంగా గీతం సంస్థలకు...విశాఖ ప్రజలు మేలుకోకపోతే

Photos

+5

ఫారిన్ ట్రిప్‌లో 'ఓజీ' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

వాలుజడతో వయ్యారంగా ప్రియాంక జైన్ (ఫొటోలు)

+5

ముద్దుగుమ్మలు ఒకేచోటు.. మాజీ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భారీ అగ్ని ప్రమాదం (ఫోటోలు)

+5

రోగి సహాయకుల కష్టాలు... ఆసుపత్రికెరుక! (ఫోటోలు)

+5

‘చాయ్ వాలా’ మూవీ సాంగ్ ను లాంచ్ చేసిన CP సజ్జనార్ (ఫోటోలు)

+5

నిహారిక 'పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌' పదేళ్ల జర్నీ వేడుక (ఫోటోలు)

+5

శ్రీకాకుళం : ఉల్లాసంగా రథసప్తమి సప్తాహ్‌ (ఫోటోలు)

+5

శ్రీకాకుళం : శోభా యాత్ర శోభాయమానం (ఫోటోలు)

+5

మణికొండ : నార్సింగిలో సందడిగా పశుసంక్రాంతి (ఫోటోలు)