ధనికులయ్యే ‘తొలి కిటుకు’ చెప్పేసిన కియోసాకి..

Published on Sun, 11/30/2025 - 14:07

ప్రపంచ ఆర్థిక అంశాలు, పెట్టుబడులపై ఎప్పటికప్పుడు వ్యాఖ్యానించే ప్రముఖ ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి ఒక కఠినమైన హెచ్చరికను జారీ చేశారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రపంచ ఆస్తి బుడగ పేలడం ప్రారంభించిందని, అత్యంత ప్రభావవంతమైన "క్యారీ ట్రేడ్"కు జపాన్  ముగింపు పలుకుతోందని హెచ్చరించారు.

ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor) రచయిత.. జపాన్ "క్యారీ ట్రేడ్" అంటే అతి-తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇచ్చే దీర్ఘకాల పద్ధతి గురించి సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో వరుస పోస్టులలో వ్యాఖ్యానించారు. ఈ విధానం ద్వారా ప్రపంచ రియల్ ఎస్టేట్, ఈక్విటీలు, బాండ్లు, కమాడిటీలు, ప్రైవేట్ వ్యాపారాలలోకి ప్రవహించిన మూలధనం ప్రపంచవ్యాప్తంగా వాటి ధరలను పెంచడానికి సహాయపడిందని పేర్కొన్నారు.

కియోసాకి (Robert Kiyosaki ) ప్రకారం.. ఈ అనూహ్య తిరోగమనం ఇప్పుడు యు.ఎస్. థాంక్స్ గివింగ్ సమయంలో "చరిత్రలో అతిపెద్ద క్రాష్"ను ప్రేరేపిస్తోంది. మార్కెట్లు కుదుపునకు లోనవుతున్నప్పుడు ఆ సంక్షోభానికి చిక్కకుండా ధనవంతులు కావడానికి ఏం చేయాలో తాను 10 వ్యూహాలను చెబుతానన్న కియోసాకి తన తొలి కిటుకును బయట పెట్టేశారు.

తొలి వ్యూహం ఇదే.. 
కియోసాకి మొదటి సూచన చమురు, సహజ వాయువు వంటి ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం. కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతి ప్రపంచ ఇంధన డిమాండ్‌ను గణనీయంగా పెంచుతుందని, సాంప్రదాయ ఇంధన ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారన్న ఆయన తాను ఇంధన రంగంలోనే పెట్టుబడుతున్నట్లు వెల్లడించారు.

కోట్లాది మంది ఉద్యోగాలు పోయి, ఆస్తులు పోగొట్టుకుని బికారులయ్యే ఈ తరుణంలో ‘నేను ధనవంతున్ని కావాలని ప్లాన్ చేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చిన ఆయన ఉద్యోగ మార్కెట్‌పైనే రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఆధారపడి ఉంటుందన్న తన ‘రిచ్‌ డాడ్‌’ పాఠాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.

‍ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయినా మీరు మాత్రం ధనికులు కావచ్చని తనను అనుసరించేవారికి కియోసాకి సూచించారు. తన నుంచి మరిన్ని సూచనలు రాబోతున్నాయన్న ఆయన ఇవి కేవలం తన సూచనలు మాత్రమేనని, సిఫార్సులు కాదని స్పష్టం చేశారు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)