'ఉద్యోగ భద్రత ఒక జోక్': రాబర్ట్ కియోసాకి

Published on Fri, 09/26/2025 - 16:33

ఎప్పుడూ బిట్‌కాయిన్‌, బంగారం వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలని చెప్పే.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి', ఇప్పుడు ఉద్యోగ భద్రత అనేది ఒక జోక్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రభుత్వం మూతపడిందా?, ఉద్యోగాల తొలగింపు ఉంటుందా?, మీరు ఉద్యోగం కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారా?, ఈ మెసేజ్ అర్థమైందా? అంటూనే.. ఉద్యోగ భద్రత ఒక జోక్ అని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఉద్యోగిగా కాకుండా వ్యవస్థాపకుడిగా మారడం గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

మార్కెట్లో అనుకోని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. 1976 నుంచి అమెరికా వివిధ స్థాయిలలో 22 షట్‌డౌన్‌లను ఎదుర్కొంది. 2018లో 34 రోజులు మార్కెట్ అత్యల్ప స్థాయిలో కొనసాగింది. ఆ తర్వాత స్టాక్‌లు, బిట్‌కాయిన్ రెండూ కోలుకోవడం ప్రారంభించాయి.

ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

చరిత్ర ప్రకారం.. షట్‌డౌన్‌లు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. సగటున 2-4 వారాల పాటు ఉంటాయి. ఎలాంటి సమయంలో అయినా.. బిట్‌కాయిన్ బలంగా ఉంటుంది. గత సంవత్సరం మార్చిలో పరిస్థితులు కొంచెం అనిశ్చితంగా కనిపించినప్పుడు, గడువుకు ముందు వారంలో బిట్‌కాయిన్ 16% పెరిగి 62,700 డాలర్ల నుంచి 73600 డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం దీని విలువ ఊహకందని రీతిలో భారీగా పెరిగింది.

సొంతంగా వ్యాపారాన్ని ప్రారభించడం లేదా బిట్‌కాయిన్ వంటివాటిలో పెట్టుబడి వంటివి మీకు ఆర్ధిక స్వేచ్ఛను ఇస్తుందని కియోసాకి సందేశం చెబుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)