Breaking News

'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకి

Published on Thu, 10/09/2025 - 13:04

బంగారంపై పెట్టుబడి పెట్టండి.. అది మిమ్మల్ని ధనవంతులను చేస్తుందని చెప్పిన 'రాబర్ట్ కియోసాకి' మాటలు నిజవవుతున్నాయి. ఇప్పుడు ఎవరిదగ్గర బంగారం ఎక్కువ ఉందో వాళ్లే ధనవంతులని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రోజు (అక్టోబర్ 9) 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 1,24,000 దాటేసింది. ఇలాంటి సమయంలో.. కియోసాకి వెండి గురించి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

పసిడి ధరల మాదిరిగానే.. ''వెండి ధర దాదాపుగా గరిష్ట స్థాయికి చేరుకుంది. సిల్వర్ రేటు మరింత పెరుగుతుంది. వెండి ధరలు భారీగా పెరగడానికి ముందే.. దయచేసి సిల్వర్ కాయిన్స్ కొనుగోలు చేయండి'' అని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.

ప్రస్తుతం భారతదేశంలో కేజీ వెండి రేటు రూ. 1,71,000 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తుంటే.. కేజీ వెండి ధర రూ. 2 లక్షలకు చేరుకోవడానికి మరెంతో సమయం పట్టదని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి బంగారంపైన మాత్రమే కాకుండా.. వెండిపై చేసే ఇన్వెస్ట్మెంట్ కూడా మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది.

గతంలో చాలా సందర్భాల్లో ఫైనాన్షియల్ ప్లానర్లు స్టాక్ కొనుగోలు చేయమని, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సలహాలు ఇచ్చారు. అయితే యూఎస్ డాలర్ విలువ క్రమంగా తగ్గుతోంది. ఈ సమయంలో స్టాక్స్, ఫండ్స్ అంత సురక్షితం కాదని కియోసాకి వాదన. అమెరికా ప్రభుత్వం చరిత్రలో అతిపెద్ద రుణగ్రహీత దేశం అయినప్పుడు.. ఆర్థిక భద్రత ఎలా ఉంటుంది. దివాలా తీసిన దేశం నుంచి బాండ్లను కొనుగోలు చేసేంత తెలివితక్కువవారు ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.

ఇదీ చదవండి: కోటీశ్వరున్ని చేసిన 30 ఏళ్ల క్రితం పేపర్లు

నిజం ఏమిటంటే.. కొన్ని సంవత్సరాలుగా బంగారం విలువ, స్టాక్‌లు.. బాండ్‌ల కంటే మెరుగైన పనితీరును కనబరిచింది. నేను ఇప్పటికీ బంగారం, వెండి నాణేలను కొనుగోలు చేయడానికే ఇష్టపడతాను. నిజమైన ఆస్తులు ఇవే. మీరు కూడా ఉత్తమైన వాటిలో పెట్టుబడి పెట్టండని కియోసాకి పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)