Breaking News

ఇన్ఫీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌: కొత్త రూల్‌పై క్లారిటీ

Published on Wed, 03/12/2025 - 18:10

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) ఇటీవల వర్క్‌ ఫ్రమ్ హోమ్‌(work from home ).. ఆఫీస్‌ హాజరుకు (Return to office) సంబంధించిన కొత్త రూల్‌ జారీ చేసింది.  తమ ఉద్యోగులు నెలలో కనీసం 10 రోజులు ఆఫీసుకు హాజరుకావాలని కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు అవసరమయ్యే ఉద్యోగులు గందరగోళంలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇన్ఫోసిస్ స్పష్టత ఇచ్చింది.

ఉద్యోగుల్లో గందరగోళం
ఒక ఉద్యోగి నెలలో కనీసం 10 రోజులు ఆఫీసు నుండి పనిచేయకపోతే "సిస్టమ్ ఇంటర్వెన్షన్"కు దారితీస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ పదం వాడకం ఉద్యోగుల్లో ఆందోళనకు దారితీసింది. ఏదైనా అత్యవసర కారణం లేదా ఉన్నతాధికారుల అనుమతితో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ తీసుకుంటే, అది యాప్‌లో నమోదు కాకపోతే తమ సెలవు కోతకు గురవుతుందని ఉద్యోగులు ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంప్లాయీ యాప్ పై స్పష్టత వచ్చింది.

మేనేజర్‌ అప్రూవల్ తప్పనిసరి 
ఇన్ఫోసిస్ ఉద్యోగులు తమ హాజరును యాప్‌లో నమోదు చేస్తారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (WFH) రిక్వెస్ట్‌లను ఈ యాప్‌ ఇకపై నేరుగా ఆమోదించదు. ఉద్యోగులు తప్పనిసరిగా తమ కార్యాలయంలో నెలకు 10 రోజులు హాజరు పంచ్ చేయాల్సి ఉంటుందని ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను ఉటంకిస్తూ ఎకనమిక్స్‌ టైమ్స్‌ కథనంలో పేర్కొంది.

ఒక నెలలో అందుబాటులో ఉన్న మొత్తం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ రోజుల సంఖ్య, ఇప్పటికే ఉపయోగించిన రోజులు, అందుబాటులో ఉన్న రోజులను యాప్ చూపిస్తుంది. అదనపు డబ్ల్యూఎఫ్‌హెచ్ రోజులను మినహాయింపుగా చూపిస్తామని, వాటిని క్రమబద్ధీకరించడానికి ఉద్యోగి తన మేనేజర్‌కు అప్రూవల్ రిక్వెస్ట్‌ను సమర్పించాల్సి ఉంటుందని యాప్‌లో అప్డేట్ చెబుతోంది.

దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్‌లో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో సుమారు 3,23,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అదనపు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ రిక్వెస్ట్‌ను ఆమోదించే లేదా తిరస్కరించే విచక్షణను మేనేజర్లకు ఇవ్వడంపైనా ఉద్యోగులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.

అమల్లోకి కొత్త హైబ్రిడ్‌ విధానం
ఇన్ఫోసిస్‌ కొత్త హైబ్రిడ్‌ విధానం మార్చి 10 నుంచి అమల్లోకి వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం దరఖాస్తు చేసుకునే రోజుల సంఖ్యను పరిమితం చేస్తున్నట్లు, నెలలో కనీసం 10 రోజులు లేదా వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆఫీసు నుండి పనిచేయాలని కంపెనీ ఫంక్షనల్ హెడ్స్ గత వారం ఒక ఇ-మెయిల్లో ఉద్యోగులకు తెలియజేశారు. ఈ కమ్యూనికేషన్ జాబ్ లెవల్ 5 (JL5)  అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులకు వర్తిస్తుంది.

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)