Breaking News

రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. రిజర్వేషన్‌ సేవలకు బ్రేక్‌!

Published on Fri, 04/12/2024 - 07:21

ఢిల్లీ, చుట్టుపక్కల రాష్ట్రాలలో నడిచే రైళ్లకు రిజర్వేషన్ చేయాలనుకుంటున్న ప్రయాణికులు శుక్రవారం రాత్రికి ముందే చేసేయండి. ఎందుకంటే ఢిల్లీ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)కు సంబంధించిన అన్ని సేవలు శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు పనిచేయవు. 

అయితే, సర్వీసులు నిలిచిపోయిన సమయంలో చాలా తక్కువ మంది మాత్రమే అసౌకర్యానికి గురవుతారని రైల్వే పేర్కొంది. చాలా కొద్ది మంది మాత్రమే ఈ సేవలను ఉపయోగిస్తున్నారని రైల్వే చెబుతోంది. పీఆర్‌ఎస్‌ దేశవ్యాప్తంగా ఐదు నగరాల నుండి పనిచేస్తుంది. వీటిలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, గౌహతి ఉన్నాయి. 

ఢిల్లీ పీఆర్‌ఎస్‌ వ్యవస్థను శుక్రవారం రాత్రి తాత్కాలికంగా మూసివేయనున్నారు. అంటే ఢిల్లీ పీఆర్‌ఎస్‌ ద్వారా నిర్వహించే అన్ని రైళ్లలో రిజర్వేషన్, రద్దు, విచారణ (139, కౌంటర్ సర్వీస్), ఇంటర్నెట్ బుకింగ్‌తో సహా అన్ని రకాల సేవలు ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 11.45 గంటల నుండి ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 04.15 గంటల వరకు దాదాపు 04.30 గంటల పాటు నిలిచిపోతాయి.

ఈ సమయంలో ఢిల్లీ పీఆర్‌ఎస్‌కు సంబంధించిన ఏ పనిని మరే ఇతర నగరంలోని పీఆర్‌ఎస్ నుండి చేయలేము. రిజర్వేషన్ లేదా మరేదైనా పనిని పూర్తి చేయాలనుకుంటే, శుక్రవారం రాత్రికి ముందే పూర్తి చేయండి.. లేకపోతే మీరు శనివారం ఉదయం మాత్రమే పూర్తి చేయగలుగుతారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)