Breaking News

జియో రీచార్జ్‌: 200 రోజుల ప్లాన్.. 500జీబీ డేటా!

Published on Sun, 10/25/2026 - 16:53

టెలికాం రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో.. రిలయన్స్‌ జియో ఎప్పటికప్పుడు తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా రూ.2,025 ప్లాన్‌ ద్వారా డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తో పాటు ఏఐ, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రయోజనాలను కూడా అందిస్తోంది. 200 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో రోజువారీ డేటాతో పాటు పలు అదనపు సదుపాయాలు లభిస్తాయి.

ఈ ప్లాన్‌ రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 2.5GB హైస్పీడ్‌ డేటా పొందవచ్చు. 200 రోజులు కాబట్టి.. మొత్తం 500GB డేటా అందుబాటులో ఉంటుందన్నమాట. దీంతో పాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 SMSలు పొందవచ్చు. అర్హత కలిగిన వినియోగదారులకు అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా ప్రయోజనం కూడా లభిస్తుంది. రోజువారీ హైస్పీడ్‌ డేటా లిమిట్ పూర్తయిన తర్వాత ఇంటర్నెట్‌ వేగం 64 Kbpsకు తగ్గుతుంది.

ఈ రీఛార్జ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాలు కూడా పొందవచ్చు. జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా హాలీవుడ్‌ సినిమాలు, ఇతర కంటెంట్‌ను వీక్షించవచ్చు. అయితే.. ఈ సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించాలంటే ప్రస్తుత ప్లాన్‌ గడువు ముగిసిన 48 గంటల్లోపు అర్హత కలిగిన మరో ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకోవాలి.

ఈ ప్లాన్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గూగుల్‌ జెమినీ ఆఫర్‌. అర్హత కలిగిన వినియోగదారులకు 18 నెలల పాటు గూగుల్‌ జెమినీ ప్రో ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు జియో తెలిపింది. దీని విలువ రూ.35,100గా పేర్కొంది. 5,000జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌, నానో బనానా వంటి ఏఐ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వీటితో పాటు 12 నెలల కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తుంది. దీని విలువ రూ.1,590. డిజైన్లు, పోస్టర్లు, సోషల్‌ మీడియా కంటెంట్‌ రూపొందించేవారికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. ఇక జియోఏఐక్లౌడ్ ద్వారా 50జీబీ ఉచిత క్లౌడ్‌ స్టోరేజ్‌ కూడా లభిస్తుంది.

ఇదీ చదవండి: వెండి ధరల్లో కలకలం.. కొనేవారికి బిగ్‌ అప్‌డేట్‌!

Videos

Big Alert: ఈ రాష్ట్రంలో ఆ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు

విర్రవీగుతున్న ఒక్కొక్కడిని చెప్తున్నా.. 2029 అధికారంలోకి వస్తే.. మీ ఊహకే వదిలేస్తున్న..

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..

హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శ

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. కాబోయే వధువులు వీరే!

వారణాసే లాస్ట్.. హాలీవుడ్ బాట పట్టనున్న జక్కన్న

ధనుష్ కొత్త పార్టీ గుర్తు ఇదేనా...?

Photos

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)

+5

ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)

+5

'డార్క్ చాక్లెట్' మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం (ఫొటోలు)

+5

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

+5

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)