Breaking News

జియో హాట్‌స్టార్ ఫ్రీగా కావాలా?

Published on Sun, 02/16/2025 - 17:00

రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్, జియోఫైబర్ ప్లాన్‌లను జియో హాట్‌స్టార్ (JioHotstar) సబ్‌స్క్రిప్షన్‌తో అప్‌డేట్ చేసింది. వీటిలో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఒక కొత్త ప్లాన్‌ను తీసుకురాగా, డిస్నీ+ హాట్‌స్టార్‌కు బదులుగా జియోహాట్‌స్టార్‌ను చేర్చడానికి మరికొన్ని ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ జియోఫైబర్ ప్లాన్‌లను అప్‌డేట్ చేసింది.

జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో ప్రీపెయిడ్ ప్లాన్
రిలయన్స్ జియో తన రూ.949 ప్రీపెయిడ్ ప్లాన్‌ను జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో అప్‌డేట్ చేసింది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, అపరిమిత 5G డేటా, రోజుకు 2GB 4G డేటాతో వస్తుంది. అదనంగా, ఇది జియో టీవీ, జియోక్లౌడ్‌తో పాటు 3 నెలల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఇందులో చేర్చిన జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ 'మొబైల్' ప్లాన్ అని గమనించడం ముఖ్యం.

జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియోఫైబర్ ప్లాన్‌లు
జియోఫైబర్ రూ.999 ప్లాన్: ఈ ప్లాన్ అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్‌తో 150 Mbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా  వినియోగదారులు ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను పొందుతారు. అలాగే ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు వర్తిస్తుంది.

జియోఫైబర్ రూ.1,499 ప్లాన్: ఈ ప్లాన్ అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్‌తో 300 Mbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను అందుకోవచ్చు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు వర్తిస్తుంది.

జియోఫైబర్ రూ.2,499 ప్లాన్: అపరిమిత డేటా , వాయిస్ కాలింగ్‌తో 500 Mbps వేగాన్ని అందిస్తుంది. దీంతోపాటు వినియోగదారులు ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను ఆనందించవచ్చు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు వర్తిస్తుంది.

రూ.3999, రూ.8499 ప్లాన్లు: అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్‌తో 1 Gbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారులు ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను పొందుతారు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు వర్తిస్తుంది.

జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌లు
జియో ఎయిర్ ఫైబర్ రూ.599 ప్లాన్: 1000GB డేటా, 30Mbps వేగం, ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు 800 టీవీ ఛానెల్‌లు, జియో హాట్‌ స్టార్‌ తో సహా మొత్తం 9 ఓటీటీలను అందిస్తుంది.

జియో రూ.899, రూ.1199 ప్లాన్లు: 1000GB డేటా, 100Mbps వేగం, ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు 800 టీవీ ఛానెల్‌లు, జియో హాట్‌స్టార్‌తో సహా మొత్తం 13 ఓటీటీలను అందిస్తుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)