Breaking News

మారిన రీచార్జ్‌ ప్లాన్లు.. ఏది చవక.. లాభదాయకం?

Published on Thu, 08/21/2025 - 15:46

దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీలు తమ రీచార్జ్‌ ప్లాన్లలో ఇటీవల మార్పులు చేశాయి. కొన్ని ఎంట్రీ లెవల్‌ ప్లాన్‌లను తొలగించాయి. అయితే ఇప్పటికీ దేశంలోని ఇతర టెలికాం ఆపరేటర్లతో పోలిస్తే రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారులకు అత్యంత చవకైన ఎంపికగా కొనసాగుతోందని బీఎన్‌పీ పారిబాస్ ప్లాన్ విశ్లేషణ నివేదిక తెలిపింది.

మూడు ప్రధాన టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్‌టెల్,  వొడాఫోన్ ఐడియా తమ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను సవరించాయి. ఈ క్రమంలో ఏ టెలికం కంపెనీలో రీచార్జ్‌ ప్లాన్లు చవకగా.. లాభదాయకంగా ఉన్నాయన్నదానిపై బీఎన్‌పీ పారిబాస్ విశ్లేషించింది. ఇందులో జియో ఇప్పటికీ అదే ధర పాయింట్లలో అధిక డేటా ప్రయోజనాలను అందిస్తోందని తేల్చింది.

28 రోజుల ప్లాన్‌కు ఇప్పుడు ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌ ఐడియా మూడు కంపెనీల్లోనూ ధర రూ .299గానే ఉంది. అయితే ప్రయోజనాలపరంగా చూస్తే జియో ఇప్పటికీ అధిక డేటా బెనిఫిట్‌లను అందిస్తోంది. దీంతో ఎక్కువ డేటా వినియోగించే కస్టమర్లకు జియో మరింత చౌకైన ఎంపికగా నిలిచిందని నివేదిక పేర్కొంది.

జియోలో అందుబాటులో ఉన్న ప్లాన్లలో, రూ .799 ప్లాన్ 84 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటాను అందిస్తుంది. మరోవైపు, రూ .249 ప్లాన్ ఇప్పుడు ఫిజికల్ జియో స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో తొలగించింది. రూ .209 వాయిస్-ఓన్లీ ప్లాన్ ​కేవలం మై జియో యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఇక రూ .189 ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఇంకా రూ.209 ప్లాన్ 22 రోజుల పాటు రోజుకు 1 జీబీని అందిస్తుంది. రూ.299 ప్లాన్ 28 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ, రూ.349 ప్లాన్ 28 రోజుల పాటు రోజుకు 2 జీబీని అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్, వీఐ ప్లాన్లతో పోలిస్తే జియో కస్టమర్లు నెలకు రూ.50 లబ్ధి పొందుతున్నారని నివేదిక విశ్లేషించింది.

ఉదాహరణకు, రోజుకు 1.5 జీబీ, 28 రోజుల ప్లాన్ ధర జియోకు రూ .299, ఎయిర్‌టెల్, బీఐలు అదే ప్రయోజనం కోసం రూ .349 వసూలు చేస్తున్నాయి. అంటే జియో వినియోగదారులకు నెలకు రూ .50 ఆదా అవుతుందన్న మాట.  అదేవిధంగా రోజుకు 2 జీబీ డేటా అందించే  28 రోజుల ప్లాన్‌కు జియో రూ.349, ఎయిర్‌టెల్ రూ.398, వీఐ రూ.365 వసూలు చేస్తున్నాయి. ఎయిర్‌టెల్‌తో పోలిస్తే రూ.49, వీఐతో పోలిస్తే రూ.16 చొప్పున జియో యూజర్లకు నెలకు ఆదా అవుతుంది.

 

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)