Breaking News

జియో కొత్త ప్లాన్‌.. వాటి కన్నా అధిక వ్యాలిడిటీ

Published on Wed, 09/04/2024 - 19:40

ప్రయివేటు టెలికం కంపెనీల మధ్య పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. టారిఫ్‌లు పెంచిన తర్వాత యూజర్ల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో వారిని ఆకట్టుకునేందుకు జియో కొత్త కొత్త ప్లాన్‌లను తీసుకొస్తోంది. ఇప్పటికే మార్కెట్‌లో టాప్‌గా ఉన్న జియో.. ప్రత్యర్థుల కంటే అధిక వ్యాలిడిటీతో మరో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్‌ రూ.999. ఇది 98 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. రోజూ 2జీబీ హైస్పీడ్‌ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అవకాశం ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5జీ డేటాను ఆస్వాదించవచ్చు. వీటితో పాటు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి విస్తృతమైన జియో సేవలు కాంప్లిమెంటరీగా లభిస్తాయి.

వోడాఫోన్-ఐడియాలో రూ.998, ఎయిర్‌టెల్‌లో రూ.979లతో ఇలాంటి ప్లాన్‌లే ఉన్నా అవి కేవలం 84 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తున్నాయి. అయితే వోడాఫోన్-ఐడియా రూ.998 ప్లాన్‌ విభిన్నమైన ఫీచర్లను అందిస్తోంది. ఇందులో అర్ధరాత్రి నుండి ఉదయం 6 గంటల వరకు అపరిమిత డేటా వినియోగాన్ని అనుమతించే బింగే ఆల్ నైట్ ఫీచర్, వారాంతపు డేటా రోల్‌ఓవర్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.అదనంగా సోనీలివ్‌ ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుది. ఇక ఎయిర్‌టెల్‌ రూ.979 ప్లాన్ 2జీబీ రోజువారీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)