Breaking News

జియో కొత్త రీచార్జ్‌ ప్లాన్‌: అదిరిపోయే ఆఫర్..

Published on Sun, 09/06/2026 - 22:08

రిలయన్స్ జియో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తన వినియోగదారుల కోసం మెగా వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. 2016 సెప్టెంబర్‌లో టెలికాం సేవలను ప్రారంభించిన జియో.. ఈ ప్రత్యేక సందర్భంలో రూ.3,599 విలువైన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏడాది మొత్తం కనెక్టివిటీతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్, క్లౌడ్, ఏఐ సేవలను అందించడమే లక్ష్యంగా ఈ ప్లాన్‌ను రూపొందించింది.

రూ.3,599 ప్లాన్‌లో ఏమేం లభిస్తాయి?

ఈ ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. వినియోగదారులకు ప్రతిరోజూ 2.5GB హైస్పీడ్ డేటా చొప్పున ఏడాదికి మొత్తం 912.5GB డేటా అందుతుంది. దీంతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అర్హత కలిగిన వినియోగదారులకు అపరిమిత 5G డేటా ప్రయోజనం కూడా ఉంటుంది.

నెలనెలా రీఛార్జ్ చేసుకోవడం ఇష్టం లేని వారికి ఈ వార్షిక ప్లాన్ ఉపయోగకరంగా ఉండనుంది. బేస్ ప్యాక్‌లో భాగంగా జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్‌ వంటి సేవలకు కూడా యాక్సెస్ లభిస్తుంది.

అదనపు ప్రయోజనాలు ఇవే..

కనెక్టివిటీ ప్రయోజనాలకు అదనంగా జియో ఈ ప్లాన్‌లో పలు ఎంటర్‌టైన్‌మెంట్, డేటా బెనిఫిట్స్‌ను అందిస్తోంది.

జియో హాట్‌స్టార్‌: హాలీవుడ్ కంటెంట్‌తో కూడిన మొబైల్ సబ్‌స్క్రిప్షన్.
జియో టీవీ ప్రో: 1,000కుపైగా టీవీ ఛానళ్లకు యాక్సెస్. రూ.55 చొప్పున 12 నెలల వోచర్ రూపంలో ప్రయోజనం.
డేటా బూస్టర్: 12 నెలల పాటు ప్రతి నెల అదనంగా 10GB డేటా.
జియో ఏఐ క్లౌడ్‌: బేస్ స్టోరేజ్‌కు అదనంగా 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్.

రూ.35,100 గూగుల్ జెమిని ప్రో ఉచితం

ఈ వార్షికోత్సవ ఆఫర్‌లో అత్యంత ఆకర్షణీయమైన ప్రయోజనం గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro) సబ్‌స్క్రిప్షన్. అర్హత కలిగిన జియో వినియోగదారులకు 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీని విలువ రూ.35,100గా పేర్కొంది. ఇందులో 5,000GB క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు అధునాతన AI ఆధారిత ఫీచర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

షాపింగ్, ట్రావెల్‌పై ప్రత్యేక వోచర్లు

మైజియో యాప్ ద్వారా వినియోగదారులకు పలు భాగస్వామ్య సంస్థల వోచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

ఈజ్‌మైట్రిప్‌: విమాన టికెట్లపై రూ.2,200 వరకు తగ్గింపు.

అజియో: రూ.1,000 కంటే ఎక్కువ విలువైన షాపింగ్‌పై రూ.200 తగ్గింపు.

సినీపోలిస్‌: కనీసం రూ.550 విలువైన రెండు టికెట్లపై ఫ్లాట్ రూ.150 తగ్గింపు. (ఈ ఆఫర్ మంగళవారం వర్తించదు.)

మొత్తంగా చూస్తే.. రూ.3,599 వార్షిక ప్లాన్ ద్వారా ఏడాది పాటు డేటా, అపరిమిత కాలింగ్, SMSలతో పాటు 5G, OTT, క్లౌడ్ స్టోరేజ్, AI సేవలు, షాపింగ్, ట్రావెల్ ప్రయోజనాలను ఒకే ప్యాక్‌లో అందించేందుకు జియో ప్రయత్నిస్తోంది.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)