Breaking News

జియో కొత్త రీఛార్జ్ ప్లాన్.. రూ.15కే అన్‌లిమిటెడ్ డేటా!

Published on Thu, 11/05/2026 - 07:55

ప్రముఖ టెలికాం కంపెనీ.. రిలయన్స్ జియో తన వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం 15 రూపాయలకే 24 గంటల పాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను అందించే కొత్త రీఛార్జ్ ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

సాధారణంగా ఎక్కువ డేటా ఉపయోగించే వారు అదనపు డేటా కోసం ఎక్కువ మొత్తంలో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పుడు కేవలం రూ.15 ఖర్చుతో ఒక రోజు మొత్తం హైస్పీడ్ 5G ఇంటర్నెట్ ఉపయోగించుకునే అవకాశాన్ని జియో కల్పిస్తోంది. వీడియోలు చూసేవారు, ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారు, భారీ ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకునే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.

24 గంటల అన్‌లిమిటెడ్ 5G డేటా
ఈ కొత్త రూ.15 ప్యాక్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో నిర్ణీత డేటా పరిమితి లేకుండా 24 గంటల పాటు అన్‌లిమిటెడ్ 5G డేటా అందిస్తున్నారు. దీంతో యూజర్లు HD, 4K వీడియోలు చూడటంతో పాటు లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. అలాగే భారీ గేమ్స్ డౌన్‌లోడ్ చేయడం, పెద్ద ఫైల్స్ అప్‌లోడ్ చేయడం, ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలను క్లౌడ్‌లో బ్యాకప్ చేసుకోవడం వంటి పనులకు కూడా ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువ ఇంటర్నెట్ అవసరమయ్యే వారికి ఈ ప్యాక్ మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ డేటాతో మొబైల్ హాట్‌స్పాట్ కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే మీ 5G ఫోన్ ద్వారా ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్లెట్‌కు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్, వీడియో కాల్స్, ఆన్‌లైన్ మీటింగ్స్ వంటి పనులు చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: ఇదీ అమెరికాలో ఉద్యోగాల పరిస్థితి!

అయితే.. ఈ అన్‌లిమిటెడ్ 5G ప్రయోజనం పొందాలంటే 5G సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ ఉండటంతో పాటు, మీ ప్రాంతంలో జియో ట్రూ 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉండాలి. ఈ రూ.15 రీఛార్జ్ ప్యాక్ దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు మైజియో యాప్, జియో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు రిలయన్స్ రిటైల్ స్టోర్లు, ఇతర రీఛార్జ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

Videos

ఇలాంటి ఏలక్షన్ లు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్...

కూటమి అరాచకాలపై వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్

నన్ను ఆపడానికి నువ్వు ఎవడివి? ఇచ్చిపడేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి

చెరువుగా మారిన శంద్రబాబు రాజధాని!

ఎన్నికల్లో ట్రంప్ కు భారీ దెబ్బ కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు

దొంగ ఓటర్లను చితకబాదిన స్థానికులు.. వైరల్ అవుతున్న వీడియోలు

ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా..! అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బాబుకు YS జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

అంతా రామమయం..!

మెగాస్టార్ డబుల్ ధమాకా ఒకే నెలలో చిరు 2 సినిమాలు

Photos

+5

అందాల అనుపమ.. తాజా ఫొటోలు

+5

సింపుల్‌ లుక్స్‌లోనూ అదిపోయిన భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

రేపే ‘సీన్‌’ రిలీజ్‌.. నజ్రీయా నజీమ్‌ ఫొటోలు వైరల్‌

+5

నగలతో నిండైన అందం.. కంగనా ట్రెడిషనల్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

గోల్డెన్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)

+5

38వ బర్త్‌డే.. విరాట్‌ కోహ్లి ఫొటోలు వైరల్‌

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)