Breaking News

జియో యూజర్లకు ఊరట.. అందుబాటులోకి చౌక ప్లాన్‌లు

Published on Fri, 07/12/2024 - 21:46

రిలయన్స్ జియో కోట్లాది మంది వినియోగదారులకు ఊరటను కలిగించింది. రీఛార్జ్ ప్లాన్‌ల ధరల పెంపు తర్వాత, వినియోగదారులు చౌకైన ప్లాన్‌ల కోసం చూస్తున్నారు. వీరి కోసం ఇప్పుడు కంపెనీ వినియోగదారుల కోసం రెండు చౌకైన ప్లాన్‌లను తీసుకొచ్చింది.

రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను ఈ నెల 3వ తేదీ నుంచి పెంచింది. దాదాపు 25 శాతం వరకు టారిఫ్‌లు పెరిగాయి. దీంతో అప్పటి వరకూ ఉన్న రూ. 149, రూ. 179 వంటి చౌక, సరసమైన ప్లాన్‌లను జియో 
జాబితా నుండి తొలగించింది. దీంతో వాటిని రీచార్జ్‌ చేసుకునే యూజర్లు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అలాంటి యూజర్ల కోసం సరికొత్త చౌక ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ప్లాన్‌ల ధరలను రూ. 189, రూ. 479గా నిర్ణయించింది. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్‌లను మై జియో యాప్ నుంచి రీఛార్జ్ చేసుకోవాలి.

జియో రూ.189 ప్లాన్
రూ.189 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని ఇస్తుంది. ఏ నెట్‌వర్క్‌కైనా 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్ చేయవచ్చు. 300 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో 2GB డేటా మాత్రమే లభిస్తుంది. అన్ని సాధారణ ప్లాన్‌ల మాదిరిగానే, జియో కస్టమర్‌లకు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.

జియో రూ. 479 ప్లాన్
దీర్ఘకాలం వ్యాలిడిటీ కోసం చూసే వినియోగదారులకు ఈ ప్లాన్ ఉత్తమమైనది. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత ఉచిత కాలింగ్, 1000 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో 84 రోజుల పాటు 6GB డేటాను అందిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. 

Videos

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)