Breaking News

జియో కొత్త ప్లాన్‌లు.. తక్కువ ఖర్చుతో ఏడాది వ్యాలిడిటీ

Published on Sun, 07/06/2025 - 17:35

కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్‌లతో చౌకగా రీఛార్జ్ ప్లాన్లను అందించాలని ట్రాయ్ కొద్ది రోజుల క్రితం అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జియో కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోనాలతో రెండు చౌక రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. తన అధికారిక వెబ్‌సైట్లో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లను జాబితా చేసింది. వీటిలో వినియోగదారులు 365 రోజుల వరకు సుదీర్ఘ వాలిడిటీని పొందుతారు. డేటా అవసరం లేని యూజర్లకు ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది.

కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే వాడే యూజర్లకు, డేటా అవసరం లేని వారికి ఈ జియో ప్లాన్‌లు ప్రత్యేకం. వీటిలో ఒక దాని ధర రూ .458 కాగా మరొకటి రూ .1958. ఇవి వరసగా 84 రోజులు, 365 రోజుల వాలిడిటీతో వస్తాయి. ఇంకా ఈ రెండు జియో ప్లాన్లలో వినియోగదారులు చాలా ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్స్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

84 రోజుల ప్లాన్
జియో కొత్త రూ.458 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్లో వినియోగదారులకు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీంతోపాటు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్స్‌కు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ముఖ్యంగా కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే వాడే యూజర్ల కోసం జియో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లో  దేశం అంతటా ఏ నెట్వర్క్‌లోనైనా అపరిమిత కాల్స్, ఉచిత నేషనల్ రోమింగ్ సదుపాయం లభిస్తుంది.

365 రోజుల ప్లాన్
జియో కొత్త రూ .1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్లో వినియోగదారులు దేశం అంతటా ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. వీటితో పాటు 3600 ఉచిత ఎస్ఎంఎస్‌లు, ఉచిత నేషనల్ రోమింగ్ ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది.

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)