Breaking News

జియో 5 కొత్త ప్లాన్‌లు.. ప్రత్యేక బెనిఫిట్‌తో..

Published on Fri, 05/30/2025 - 21:01

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్లౌడ్ గేమింగ్ మార్కెట్ దృష్ట్యా రిలయన్స్ జియో ఒక పెద్ద అడుగు వేసింది. కంపెనీ ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించింది. వీటిలో ఉచితంగా జియోగేమ్స్ క్లౌడ్  ప్రయోజనాన్ని అందిస్తోంది. అంటే ఖరీదైన హార్డ్‌వేర్ లేకుండా యూజర్లు తమ మొబైల్, పీసీ, జియో సెట్-టాప్ బాక్స్‌లో కన్సోల్ లాంటి గేమ్స్‌ను ఆస్వాదించగలరు. ఈ ప్లాన్లు రూ.48 నుంచి ప్రారంభమవుతాయి.

ఏమిటీ జియోగేమ్స్ క్లౌడ్?
ఇది క్లౌడ్ ఆధారిత గేమింగ్ సర్వీస్. దీని ద్వారా యూజర్లు గేమ్‌ను డౌన్లోడ్ చేయకుండా నేరుగా ఆన్‌లైన్‌లో ఆడవచ్చు. సాధారణంగా దీని సబ్ స్క్రిప్షన్ రూ.398. కానీ కొత్త ప్లాన్లలో ఈ సదుపాయాన్ని ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా జియో ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ప్రస్తుతం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. పోస్ట్‌ పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఇది అందుబాటులో లేదు.

జియో కొత్త గేమింగ్ ప్లాన్స్ ఇవే..

రూ.48 ప్లాన్: ఇది గేమింగ్ ప్రయత్నించాలనుకునే స్వల్పకాలిక వినియోగదారుల కోసం తీసుకొచ్చిన ప్లాన్‌. ఈ ప్లాన్‌ 10 ఎంబీ డేటా, జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ ను 3 రోజుల పాటు అందిస్తుంది.

రూ.98 ప్లాన్: ఈ ప్లాన్‌తో 7 రోజుల పాటు 10 ఎంబీ డేటా, గేమింగ్ యాక్సెస్ లభిస్తుంది. ఇది డేటా వోచర్, కాబట్టి దీనిని ఉపయోగించడానికి యాక్టివ్ బేస్ ప్లాన్ కలిగి ఉండటం అవసరం.

రూ.298 ప్లాన్: జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ తో పాటు 3 జీబీ డేటాను 28 రోజుల పాటు అందిస్తుంది. ఇది కూడా డేటా వోచర్. యాక్టివ్ ప్లాన్ తో మాత్రమే ఉపయోగించవచ్చు.

రూ.495 ప్లాన్: రోజుకు 1.5 జీబీ డేటా, 5 జీబీ బోనస్ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను 28 రోజుల పాటు అందిస్తుంది. జియోగేమ్స్ క్లౌడ్, జియోసినిమా (డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్), ఫ్యాన్‌కోడ్, జియోటీవీ, జియోఏఐక్లౌడ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

రూ.545 ప్లాన్: ఇది అత్యంత ప్రీమియం ప్లాన్. 2 జీబీ రోజువారీ డేటా, 5 జీబీ బోనస్ డేటా, అపరిమిత 5 జీ డేటా ఇందులో లభిస్తాయి. మిగతా ఫీచర్లన్నీ రూ.495 ప్లాన్ మాదిరిగానే ఉంటాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)