Breaking News

దిగొచ్చిన జియో.. సైలెంట్‌గా మళ్లీ పాత ప్లాన్‌

Published on Sat, 07/20/2024 - 08:22

టారిఫ్‌ పెంపుతో యూజర్లలో తీవ్ర అసంతృప్తిని మూటకట్టుకున్న రిలయన్స్‌ జియో, వారిని సంతృప్తి పరచడానికి కాస్త దిగివచ్చింది. తన రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్‌ని నిశ్శబ్దంగా తిరిగి ప్రవేశపెట్టింది.

ఎక్కువ మంది రీచార్జ్‌ చేసుకునే రూ.999 ప్లాన్‌ ధరను జూలై 3న రూ.1,199కి జియో పెంచేసింది. అయితే తాజాగా కొన్ని సవరించిన ప్లాన్ ఫీచర్‌లు, ప్రయోజనాలతో పాత ప్లాన్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది.

కొత్త రూ. 999 ప్లాన్‌లో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే, దాని పొడిగించిన వ్యాలిడిటీ. పాత ప్లాన్‌లో ఇది 84 రోజులు ఉండగా కొత్త ప్లాన్‌ 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే 14 రోజులు అదనపు వ్యాలిడిటీ లభిస్తుందన్నమాట. కానీ రోజువారీ డేటాను మాత్రం కొత్త ప్లాన్‌లో తగ్గించేశారు. గత ప్లాన్‌లో రోజుకు 3GB డేటా లభిస్తుండగా కొత్త ప్లాన్‌ రోజుకు 2GB డేటాను అందిస్తుంది. డేటా పరిమితి తగ్గినప్పటికీ దీంతో 5జీ డేటాను ఆనందించవచ్చు. ఇక రోజుకు 100 SMSలు, అపరిమిత వాయిస్ కాలింగ్ ఫీచర్లు ఉన్నాయి.

దీనికి పోటీగా ప్రత్యర్థి టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ కూడా రూ.979 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే అపరిమిత 5G డేటాను ఆనందించవచ్చు. ఇక ఎయిర్‌టెల్ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనం ఏమిటంటే, 56 రోజుల పాటు ఉచిత అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)