Breaking News

రూ.24,900 కోట్ల అప్పు కోసం బ్యాంకులతో చర్చలు?

Published on Tue, 12/10/2024 - 13:22

రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 బిలియన్‌ డాలర్లు(రూ.24,900 కోట్లు) రుణాన్ని పొందేందుకు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. వచ్చే ఏడాది చెల్లించాల్సిన రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి ఈ నిధులను ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది. ఈమేరకు దాదాపు ఆరు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.

కంపెనీ గతంలో తీసుకున్న దాదాపు 2.9 బిలియన్‌ డాలర్ల రుణాల మెచ్యురిటీ 2025 మొదటి త్రైమాసికంలో ముగుస్తుంది. కాబట్టి కంపెనీ ఆయా రుణాలు చెల్లించి తిరిగి రిఫైనాన్స్‌కు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే బ్యాంకు ఇంతమొత్తంలో చెల్లించడం ఒకింత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కాబట్టి, దాదాపు ఆరు బ్యాంకులతో సంస్థ అధికారులు చర్చలు జరుపుతున్నారని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే 2023 నుంచి కొంత విరామం తర్వాత రిలయన్స్ ఆఫ్‌షోర్ రుణాల(ఇతర దేశాలు అందించే అప్పులు) మార్కెట్‌లోకి తిరిగి ప్రవేశించినట్లుగా అవుతుంది. ఇదిలాఉండగా, రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఇటీవల రుణాల ద్వారా 8 బిలియన్‌ డాలర్లకు పైగా నిధులు సేకరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ ప్రొఫైల్ మెరుగ్గా ఉండడంతో రుణాలు పొందేందుకు మార్గం సులువవుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: గ్లోబల్‌ సౌత్‌ లీడర్‌గా భారత్‌

మూడీస్‌ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ రేటింగ్‌ను Baa2 వద్ద స్థిరంగా ఉంచింది. ఇది ఇండియన్‌ సావరిన్‌ గ్రేడ్ కంటే మెరుగ్గా ఉండడం కూడా రిలయన్స్‌కు కలిసొచ్చే అంశంగా భావించవచ్చు. సంస్థ ఆర్థిక స్థితి, విభిన్న వ్యాపార నమూనా, వినియోగదారుల్లో విశ్వసనీయత..వంటి అంశాలు కూడా రుణదాతలకు భరోసా కల్పిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)