Breaking News

తుఫాను బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్

Published on Fri, 11/06/2026 - 18:37

ఆంధ్రప్రదేశ్‌లో 'అర్నబ్‌' తుఫాను సృష్టించిన విధ్వంసానికి నష్టపోయిన మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తుఫాను వల్ల కొట్టుకుపోయిన 180కి పైగా పడవలను వెలికితీసేందుకు, అలాగే మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి మద్దతుగా ఒక సమన్వయ కార్యక్రమాన్ని చేపడుతోంది.

తుఫాను కారణంగా కోనసీమ జిల్లాలోని ఓడలరేవు, సఖినేటిపల్లి ల్యాండింగ్ కేంద్రాల్లోని మత్స్యకార వర్గాల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. అనేక చేపల వేట పడవలు పేరుకుపోయిన బురదలో చిక్కుకుపోయి, పాక్షికంగా లేదా పూర్తిగా మునిగిపోయాయి. కొన్ని పడవలు ఒకచోట నుండి మరొకచోటికి కొట్టుకుపోగా, మరికొన్ని ఒకదానిపై ఒకటి పడిపోయాయి. రిలయన్స్ ఫౌండేషన్ బృందాలు ఇక్కడ క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, తమ "వి కేర్" (We Care) చొరవకు అనుగుణంగా, తక్షణమే స్పందిస్తూ భారీ యంత్రాల సహాయంతో పడవలను వెలికితీసే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

అల్లావరం మండలంలోని ఓడలరేవు, సఖినేటిపల్లి ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం.. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 186 చేపల వేట పడవలు తమ లంగరు స్థానాల నుండి కొట్టుకుపోయి కాలువలు, బురద ప్రాంతాలు, సమీప ల్యాండింగ్ స్థలాలలో చిక్కుకున్నాయి. వీటిలో కొన్ని పాక్షికంగా మునిగిపోవడం లేదా ఒండ్రులో ఇరుక్కుపోవడంతో చేతులతో వెలికితీయడం కష్టంగా, ప్రమాదకరంగా మారింది. సుమారు 5 నుండి 10 టన్నుల బరువున్న ఈ పడవలు ప్రస్తుతం దారి సరిగ్గా లేని, బురద పేరుకుపోయిన ప్రమాదకర ప్రాంతాలలో ఉన్నాయి.

వీటిని భారీ క్రేన్లు, యంత్రాల ద్వారా  వెలికితీసి, యథాస్థానానికి చేర్చేందుకు స్థానిక మత్స్య శాఖ అధికారులతో కలిసి రిలయన్స్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఈ బృందం స్థానిక మత్స్యకారులతో కలిసి పడవలను గుర్తించి, వాటి లొకేషన్లను నిర్ధారించుకుని, సురక్షితమైన పరిధిలో క్రేన్ ఆపరేటర్ల సహాయంతో ఒక ప్రణాళికాబద్ధంగా పడవలను వెలికితీసే పనిని చేపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలోని సుమారు 10,000 మంది మత్స్యకారుల జీవనోపాధికి నేరుగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)