Breaking News

‘నా లక్ష్యం అదే’ : ముఖేష్‌ అంబానీ

Published on Fri, 12/29/2023 - 07:17

న్యూఢిల్లీ: ఇప్పటివరకు సాధించిన విజయాలతో సంతృప్తి పడి, అలసత్వం వహించబోమని రిలయన్స్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పారు. డిజిటల్‌ డేటా ప్లాట్‌ఫాంలు, కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో ప్రపంచ టాప్‌ 10 వ్యాపార దిగ్గజాల్లో ఒకటిగా ఎదగడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

గ్రూప్‌ వ్యవస్థాపకుడు ధీరుభాయ్‌ అంబానీ జయంతి సందర్భంగా నిర్వహించే రిలయన్స్‌ ఫ్యామిలీ డేలో పాల్గొన్న సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ‘నేడు దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితులు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. సాధించిన వాటితో సంతృప్తి చెంది ఆగిపోవడానికి తావు లేదు. రిలయన్స్‌ ఎప్పటికప్పుడు కొంగొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతుంది’ అని అంబానీ చెప్పారు.

‘ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఎదిగేందుకు భారత్‌ ముందుకు పరుగులు తీస్తున్న నేపథ్యంలో రిలయన్స్‌ ఎదుట అసాధారణ అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలోనే టాప్‌ 10 వ్యాపార దిగ్గజాల్లో రిలయన్స్‌ ఎదగగలదు. తప్పకుండా ఎదుగుతుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం ఉద్యోగులంతా కస్టమర్లకు మరింత విలువ చేకూర్చేలా సేవలందించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. డిజిటల్‌ డేటా ప్లాట్‌ఫామ్‌లు.. ఏఐ వినియోగంలో గ్లోబల్‌ లీడర్లలో స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, సంస్థాగత సంస్కృతి విషయంలో అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకటిగా ఎదగడం నూతన సంవత్సర తీర్మానాలుగా నిర్దేశించుకోవాలని ఆయన సందేశమిచ్చారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి