Breaking News

బంగారానికి భవిష్యత్‌లో మరింత ఆదరణ

Published on Tue, 03/04/2025 - 05:06

న్యూఢిల్లీ: పెట్టుబడులకు కీలకమైన వైవిధ్య సాధనంగా బంగారం రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంతనాగేశ్వరన్‌ అన్నారు. బంగారం విలువను కాపాడుకునే సాధనంగానే (స్టోర్‌ ఆఫ్‌ వ్యాల్యూ) కాకుండా, ఆభరణంగా, పోర్ట్‌ఫోలియోకి వైవిధ్యంగా నిలస్తుందన్నారు. అప్పటికి యావ్‌ ప్రపంచం అంతర్జాతీయంగా ఒకే మానిటరీ వ్యవస్థకు చేరుకుంటుందన్నారు. 

ఐజీపీసీ–ఐఐఎంఏ బంగారం మార్కెట్ల వార్షిక సదస్సులో భాగంగా నాగేశ్వరన్‌ మాట్లాడారు. బంగారం ధర గతేడాది 27 శాతం మేర పెరగ్గా, ఈ ఏడాది ఇప్పటికే 12 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో నాగేశ్వరన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విలువను కాపాడుకునే సాధనంగా బంగారం పాత్రను పలుచన చేయకుండానే, బంగారం నిల్వలను ఉత్పాదకత పెంపునకు వినియోగించడానికి మార్గాలను భారత్‌ కొనుగొనాల్సి ఉందన్నారు.

 ఇక్కడే విధానపరమైన సవాళ్లు నెలకొన్నట్టు చెప్పారు. గతంలో మాదిరి బంగారం మానిటైజేషన్‌ (నగదుగా మార్చుకోవడం) తరహా చర్యలను పరిశీలించాలన్నారు. 2015లో బంగారం మానిటైజేషన్‌ పథకాన్ని కేంద్రం ప్రకటించడం గమనార్హం. బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేయడం ద్వారా దానిపై వడ్డీని పొందే పథకం అది. దిగుమతులను తగ్గించే లక్ష్యంతో కేంద్ర నాడు దీన్ని తీసుకొచి్చంది. ఆ తర్వాత కొన్నాళ్లకే మరుగునపడింది.  

రుణ భారం మరింత పెరిగితే కష్టమే.. 
నేడు ప్రపంచ రుణ భారం జీడీపీతో పోల్చితే ఎన్నో రెట్లకు పెరిగిందని అనంతనాగేశ్వరన్‌ తెలిపారు. ‘‘ఆ స్థాయి అధిక రుణ భారం తలనొప్పిగా మారుతుంది. భవిష్యత్‌ ఆదాయం వడ్డీ చెల్లింపులకే వెళుతుంది. అభివృద్ధికి పెద్దగా మిగిలేది ఉండదు. అధిక రుణ భారం నేపథ్యంలో దేశాలు ద్రవ్యోల్బణాన్ని ఉపయోగించుకుని రుణం విలువను తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు’’అని నాగేశ్వరన్‌ పేర్కొన్నారు.  
 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)