Breaking News

బస్సులో వస్తావా? ఉద్యోగం లేదు పో..

Published on Mon, 05/12/2025 - 10:07

జాబ్‌ ఇంటర్వ్యూకు బస్సులో వచ్చిన యువతికి ఉద్యోగం లేదు.. ఏమీ లేదు పో.. అంటూ ఓ కంపెనీ వెనక్కి పంపేసింది. తనకు ఎదురైన ఈ షాకింగ్‌ అనుభవాన్ని ఆ యువతి ప్రొఫెషనల్‌ సామాజిక వేదిక రెడ్డిట్‌ ద్వారా పంచుకున్నారు. తన అర్హతలు, నైపుణ్యాలు చూడకుండా కేవలం తాను ప్రజా రవాణాను ఉపయోగించినందుకు ఇంటర్వ్యూ నుంచి పంపించేశారని ఆమె వాపోయారు.

యువతి రెడ్డిట్ పోస్ట్ ప్రకారం.. బస్సు దిగి కంపెనీ భవనంలోకి నడిచి వస్తున్న ఆమెను సెక్యూరిటీ కెమెరాల్లో గమనించిన హైరింగ్ మేనేజర్.. ఇంటర్వ్యూ మొదలవ్వగానే ఆమె అర్హతలు లేదా అనుభవం గురించి కాకుండా మొదట ఆమె బస్సులో రావడం గురించే అడిగాడు. ప్రజా రవాణాను ఉపయోగించినందుకు అసహనం వ్యక్తం చేసిన ఆయన అంతటితో ఆగకుండా వ్యక్తిగతంగానూ కామెంట్‌ చేశాడు. ఎర్రగా ఉన్న ఆమె జుట్టును "అన్ ప్రొఫెషనల్" అని వ్యాఖ్యానించాడు.

అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే.. "ఇప్పుడే ఇంటర్వ్యూకు వెళ్లొచ్చాను. నేను కంపెనీ భవనం వైపు నడిచిరావడం కెమెరాల్లో చూశానని బాస్ చెప్పారు. నీకు మంచి ట్రాన్స్‌పోర్ట్‌ లేదా అని అడిగారు. ప్రజా రవాణాను ఉపయోగించకూడదని చెప్పి కొన్ని నిమిషాలు మందలించాడు. నన్ను ఎవరూ నియమించుకోరని, తానైతే ఇలాంటి వారికి అస్సలు జాబివ్వనని చెప్పాడు. ఎందుకంటే వారు సమయానికి రారు. ఇక నా ఎర్రటి జుట్టు గురించి ఫిర్యాదు చేయడం కొనసాగించాడు. అది నన్ను అన్ ప్రొఫెషనల్ గా మార్చింది అన్నాడు. ఇంటర్వ్యూ ప్రశ్నలు అడగలేదు. తమకు చాలా మంది అభ్యర్థులు ఉన్నారని, షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి నన్ను పంపించేశారు."

అయితే ఇంతకీ సదరు కంపెనీ ఏది.. అనుచితంగా ప్రవర్తించిన ఆ హైరింగ్‌ మేనేజర్‌ పేరేంటి అన్నది ఆమె వెల్లడించలేదు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌కు చాలా మంది యూజర్లు ప్రతిస్పందించారు. అలా ప్రవర్తించిన ఆ మేనేజర్‌ తీరును తప్పుబట్టారు. ఆమెకు మద్దుతుగా నిలిచారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)