Breaking News

కొత్తిల్లు కొందామా.. పాతిల్లు చూద్దామా?

Published on Sat, 07/19/2025 - 15:55

సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల. అయితే గృహ కొనుగోలు నిర్ణయం అంత తేలికైందేమీ కాదు. ప్రాంతం ఎంపిక నుంచి మొదలు పెడితే బడ్జెట్, నిర్మాణ నాణ్యత, నిర్మాణ సంస్థ నేపథ్యం, కొనుగోలుదారుడి అవసరాల వరకూ ప్రతి ఒక్కటీ ప్రధానమైందే. సమాజంలో గుర్తింపు కోసం కొందరు ఇల్లు కొంటే.. మరికొందరేమో పెట్టుబడి కోసం, ట్యాక్స్‌ నుంచి మినహాయింపుల కోసం కొంటుంటారు. కారణాలేవైనా ఇల్లు కొనడమనేది ఓ నిరంతర ప్రక్రియ. మరి, ఎలాంటి ఇల్లు కొంటే సొంతింటి యోగం మరింత తేలికవుతుంది? అంటే కొత్త ఇల్లు కొనడమా? లేక సెకండ్‌ హ్యాండ్‌ ఇల్లు బెటరా? అని! – సాక్షి, సిటీబ్యూరో

దేశంలో కొత్త గృహాలకు డిమాండ్‌ ఎంత ఉందో రీసేల్‌ లేక సెకండ్‌ హ్యాండ్‌ ఇళ్లకూ అంతే ఉంది. కొత్త ఇల్లు నేరుగా డెవలపర్‌ నుంచి కొనుగోలు చేస్తే.. రీసేల్‌ ప్రాపర్టీలను పాత యజమాని నుంచి కొనుగోలు చేస్తాం. కొత్త లేక పాత ప్రాపర్టీ ఏదైనా కానీ ఎంపికలో ప్రధానమైంది బడ్జెట్‌. దీంతో పాటూ మన జీవన శైలి, అవసరాలు, అభిరుచులు, ఇంటీరియర్, ఇంధన సామర్థ్యాలు వంటివి కూడా ప్రాపర్టీ ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ప్రధాన నగరంలో సెకండ్సే బెటర్‌..

ఇల్లు కొనుగోలు చేసిన వారెవరైనా సరే ఎప్పటికీ ఒకే ఇంట్లో ఉండాలనుకుంటారు. ఫ్యామిలీ పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు గానీ ఉద్యోగ రీత్యా, కుటుంబ అవసరాల రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గానీ ఆర్థిక అవసరాల కోసం ఇంటిని విక్రయించాలనుకుంటారు. విద్యా, వైద్యం, వినోదం ఇతర అవసరాలకు రోజూ ప్రధాన నగరంతో అనుబంధం ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో కొత్త గృహాలు దొరకడం కొంత కష్టం. ఒకవేళ దొరికినా ధర ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఏరియాల్లో సెకండ్‌ హ్యాండ్‌ ఇల్లును కొనుగోలు చేయడం బెటర్‌. అవసరమైతే దాన్ని కూల్చేసి మన అవసరాలు, బడ్జెట్‌కు తగ్గట్టు మళ్లీ కొత్త గృహాన్ని నిర్మించుకోవచ్చు. అయితే ఇది కొంత డబ్బు, సమయంతో ముడిపడి ఉన్న అంశం. అందుకే ప్రధాన నగరంలో, అభివృద్ధి చెందిన ప్రాంతంలో రీసెల్‌ ప్రాపర్టీలను ఎంచుకోవటమే ఉత్తమమనేది నిపుణుల సూచన.

రీసేల్‌ కొనేముందు..

రీసేల్‌ ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు పాత యజమాని నేపథ్యం, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, టైటిల్, అనుమతి పత్రాలు, గృహ రుణానికి సంబంధించిన పత్రాలు వంటి వాటిని స్వయంగా పరిశీలించుకోవాలి. ఏమాత్రం అవగాహన లేకపోయినా లేక తప్పిందం జరిగినా సరే మొదటికే మోసం వస్తుంది. అదే కొత్త ఇల్లు కొనుగోలు చేస్తే ఈ ప్రక్రియంతా డెవలపరే పూర్తి చేసేస్తాడు.

పాత ఇళ్లలో ఎలక్ట్రిక్‌ వైర్లు, ఉపకరణాలు, బాత్‌రూమ్‌ ఫిట్టింగ్స్‌ వంటి వాటిల్లో సమస్య వస్తుంటుంది. అదే కొత్త గృహాల్లో బ్రాండెండ్, నాణ్యమైన ఉత్పత్తుల వినియోగంతో ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. పైగా పాత ఇళ్లలో వాస్తు మార్పులు, గదుల్లో చిన్న చిన్న మార్పులు చేయాలంటే ఇబ్బందులుంటాయి. అదే కొత్త గృహాల్లో నిర్మాణంలో ఉన్నప్పటి నుంచే డెవలపర్‌కు మన అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణంలో మార్పులు చేసుకునే వీలుంటుంది.

శివారు ప్రాంతాల్లో కొత్త ఇళ్ల ధరలు తక్కువ

కొత్త గృహాలతో పోలిస్తే రీసేల్‌ ప్రాపర్టీలు కొంత తక్కువ ధరకే లభ్యమవుతాయి. కానీ, రిజి్రస్టేషన్‌ ఫీజు, ప్రాపర్టీ బదిలీ రుసుము, వినియోగ చార్జీలు వంటివి చెల్లించాల్సి ఉంటుంది. పైగా సెకండ్‌ హ్యాండ్‌ హోమ్స్‌ నిర్వహణ భారం ఎక్కువగా ఉంటుంది. పైగా మన అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఇంటిని రిపేర్‌ చేయించాల్సి ఉంటుంది. ఆయా ఖర్చులన్నింటినీ కలిపి చూస్తే మాత్రం రీసేల్‌ ప్రాపర్టీ కంటే అభివృద్ధి చెందే ప్రాంతంలో, శివారు ప్రాంతంలోని కొత్త గృహాల ధరలే తక్కువగా ఉంటాయి.

పర్యావరణం స్పృహ, ఇంధన నిర్వహణ సామర్థ్యాలు, కరెంట్‌ బిల్లుల మీద అవగాహన ఉంటే మాత్రం కొత్త ఇల్లు కొనడమే ఉత్తమం. ఎందుకంటే కొత్త గృహాలు ఎనర్జీ ఎఫీషియన్సీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇంట్లోనే ఉపకరణాలతో పాటూ గోడలు, పైకప్పులు, కిటికీలు, తలుపులు కూడా ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. దీంతో విద్యుత్‌ బిల్లు తక్కువగా రావటంతో పాటూ నిర్వహణ వ్యయం కూడా తక్కువ అవుతుంది. రీసేల్‌ ప్రాపర్టీలను కూడా ఎనర్జీ ఎఫీషియన్సీ ప్రమాణాలకు అనుగుణంగా మార్చవచ్చు. కానీ, ఆయా పాత గృహాలు దశాబ్ధాల క్రితం నాటి ప్రమాణాలను అనుగుణంగా నిర్మితమైనవి. వాటిని ఇప్పటి ప్రమాణాలను అనుగుణంగా మార్చాలంటే ఖర్చు ఎక్కువవుతుంది. కొత్త ఇళ్లలో గాలి, వెలుతురు బాగా వస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)