Breaking News

రూపాయి స్థిరీకరణకు ఆర్‌బీఐ చర్యలు

Published on Sat, 01/18/2025 - 07:49

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఆల్‌టైమ్‌ కనిష్టం 86.70ని చూసిన నేపథ్యంలో, దేశీయ కరెన్సీ ఒడిదుడుకుల నివారణ, స్థిరీకరణ లక్ష్యంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక చొరవలకు శ్రీకారం చుట్టింది. విదేశీ లావాదేవీల్లో రూపాయి (rupee) వినియోగం ప్రోత్సాహం లక్ష్యంగా కీలక చర్యలను ప్రకటించింది.

సరిహద్దు వాణిజ్య లావాదేవీల్లో భారత రూపాయి అలాగే స్థానిక, జాతీయ కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి సంబంధిత నిబంధనలను సరళీకృతం చేసింది. రూపాయిలో పలు దేశాలతో వాణిజ్య లావాదేవీలను నిర్వహించడం, తద్వారా డాలర్ల డిమాండ్‌ను తగ్గించడం, రూపాయి విలువ స్థిరీకరణ ఆర్‌బీఐ నిర్ణయాల ప్రధాన లక్ష్యాలు.  

సెంట్రల్‌ బ్యాంకులతో ఎంఓయూలు..
భారతీయ రూపాయితో సహా స్థానిక కరెన్సీలలో సరిహద్దు లావాదేవీలను ప్రోత్సహించడానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ఇండోనేషియా, మాల్దీవుల సెంట్రల్‌ బ్యాంకులతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఇప్పటికే అవగాహన ఒప్పందం (ఎంఓయూ)లపై సంతకం చేసింది. వాణిజ్య లావాదేవీల కోసం భారత రూపాయిని ప్రోత్సహించడానికి  2022 జూలైలో ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతా (ఎస్‌ఆర్‌వీఏ) సౌలభ్యాన్ని ఆర్‌బీఐ ఏర్పాటు చేసింది.

అనేక విదేశీ బ్యాంకులు భారతదేశంలోని బ్యాంకులతో ఎస్‌ఆర్‌వీఏలను ప్రారంభించాయి. ఎన్‌ఆర్‌ఐ ఖాతాల లావాదేవీల విషయంలో తాజాగా మరింత సరళతర నిబంధనలను ఆర్‌బీఐ తీసుకువచ్చింది. సరళీకృత ఫెమా నిబంధనల ప్రకారం, భారతదేశం వెలుపల నివసించే వ్యక్తులు ప్రత్యేక నాన్‌–రెసిడెంట్‌ రూపాయి ఖాతా, ఎస్‌ఆర్‌వీఏల్లోని బ్యాలెన్స్‌లను ఉపయోగించి ఇతర నాన్‌–రెసిడెంట్‌లతో విశ్వసనీయ లావాదేవీలను నిర్వహించడానికి వీలవుతుంది.

భారతీయ ఎగుమతిదారులు వాణిజ్య లావాదేవీల సెటిల్‌మెంట్‌ కోసం విదేశాలలో ఏదైనా విదేశీ కరెన్సీలో ఖాతాలను తెరవగలరని కూడా ఆర్‌బీఐ తెలిపింది. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వీకరించడం, ఈ ఆదాయాన్ని దిగుమతుల కోసం చెల్లించడం వంటి కార్యకలాపాలను నిర్వహించవచ్చు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)