Breaking News

భారత్‌లో క్రెడిట్‌ కార్డుల జోరు

Published on Tue, 01/28/2025 - 02:14

ముంబై: క్రెడిట్‌ కార్డుల సంఖ్య భారత్‌లో సుమారు 10.8 కోట్లకు చేరింది. అయిదేళ్లలో వీటి సంఖ్య రెండింతలకుపైగా దూసుకెళ్లిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సోమవారం విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. 2019 డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా కస్టమర్లకు జారీ అయిన క్రెడిట్‌ కార్డుల సంఖ్య 5.53 కోట్లు నమోదైంది. అయితే డెబిట్‌ కార్డుల సంఖ్య క్రెడిట్‌ కార్డుల స్థాయిలో పెరగకపోవడం గమనార్హం. డెబిట్‌ కార్డులు అయిదేళ్లలో 80.53 కోట్ల నుంచి 2024 డిసెంబర్‌ నాటికి 99.09 కోట్లకు చేరాయి.  

అంతా డిజిటల్‌మయం.. 
దశాబ్ద కాలంలో డిజిటల్‌ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. 2013లో రూ.772 లక్షల కోట్ల విలువైన 222 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరిగాయి. 2024లో ఈ లావాదేవీలు పరిమాణంలో 94 రెట్లు, విలువలో 3.5 రెట్లు పెరిగి రూ.2,758 లక్షల కోట్ల విలువైన 20,787 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అయిదేళ్లలో డిజిటల్‌ చెల్లింపులు పరిమాణంలో 6.7 రెట్లు, విలువలో 1.6 రెట్లు ఎగశాయి. అయిదేళ్లలో వార్షిక వృద్ధి ఏటా సగటున పరిమాణంలో 45.9 శాతం, విలువలో 10.2 శాతం పెరిగింది. రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపులు 12 ఏళ్లలో సుమారు 100 రెట్లు దూసుకుపోయాయి. ఇవి 2012–13లో 162 కోట్ల లావాదేవీలు నమోదు కాగా.. 2023–24లో వీటి సంఖ్య ఏకంగా 16,416 కోట్లను తాకిందని నివేదిక తెలిపింది.  

విదేశాల్లోనూ యూపీఐ.. 
ఇతర దేశాల ఫాస్ట్‌ పేమెంట్‌ సిస్టమ్స్‌తో యూపీఐని అనుసంధానించడం ద్వారా విదేశీ చెల్లింపులను మెరుగుపరిచేందుకు ఆర్‌బీఐ కృషి చేస్తోందని నివేదిక పేర్కొంది. అధిక వ్యయం, తక్కువ వేగం, సేవలు పరిమితంగా ఉండడం, విదేశాలకు చెల్లింపులలో పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడంలో ఇటువంటి అనుసంధానాలు సహాయపడతాయని పేర్కొంది. క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా భారతీయ యూపీఐ యాప్‌లను ఉపయోగించి భూటాన్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, యూఏఈలోని వ్యాపారులకు చెల్లింపులు చేయవచ్చు. చెల్లింపుల మౌలిక వసతులు, పనితీరులో చెప్పుకోదగ్గ వృద్ధి ఆర్‌బీఐ ప్రచురించిన డిజిటల్‌ పేమెంట్‌ ఇండెక్స్‌లో స్పష్టంగా కనిపిస్తుందని నివేదిక వివరించింది.    

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు