Breaking News

కస్టమర్ల హక్కుల రక్షణకు ఆర్‌బీఐ నయా వ్యూహం

Published on Tue, 07/14/2026 - 09:05

డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో.. కస్టమర్ల ఫిర్యాదులు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్ల సమస్యలకు బ్యాంకుల స్థాయిలోనే న్యాయమైన, శాశ్వత పరిష్కారం లభించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చర్యలు చేపట్టింది. కస్టమర్ ఫిర్యాదులను అర్థవంతంగా, పారదర్శకంగా పరిష్కరించాలని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ అంతర్గత అంబుడ్స్‌మెన్‌లను ఆదేశించారు.

క్షేత్రస్థాయిలోనే పరిష్కారం..

ఒక కస్టమర్ బ్యాంకు సేవలపై అసంతృప్తితో ఫిర్యాదు చేసినప్పుడు ఆ సంస్థ దానిని తిరస్కరిస్తే ఆటోమేటిక్‌గా అది అంతర్గత అంబుడ్స్‌మెన్ పరిశీలనకు వెళ్తుంది. అయితే, చాలా సందర్భాల్లో ఈ ఫిర్యాదులు సరిగ్గా పరిష్కారంకాక ఆర్‌బీఐ అంబుడ్స్‌మెన్ స్థాయికి చేరుకుంటున్నాయి. దీనివల్ల కేంద్ర బ్యాంకుపై అదనపు భారం పడుతోంది. ఈ ఎస్కలేషన్లను తగ్గించడమే ఆర్‌బీఐ తాజా ఆదేశాల ఉద్దేశం. సమస్యలను ప్రాథమిక దశలోనే పరిష్కరిస్తే కస్టమర్లకు సమయం కలిసిరావడంతో పాటు బ్యాంకులపై నమ్మకం పెరుగుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది.

‘బ్యాంకులు నియమించే అంతర్గత అంబుడ్స్‌మెన్‌లు కేవలం సాంకేతిక నిబంధనలను చూపి కస్టమర్ల ఫిర్యాదులను తోసిపుచ్చకూడదు. వారు బ్యాంక్ యాజమాన్య ఒత్తిళ్లకు లొంగకుండా ఒక స్వతంత్ర న్యాయమూర్తిలా నిష్పాక్షికంగా వ్యవహరించాలి. మానవీయ కోణంలో కస్టమర్ వైపు ఉన్న న్యాయాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలి’ అని స్వామినాథన్‌ చెప్పారు.

ఇదీ చదవండి: ఏఐ ఎందుకో వెనుకబడింది?

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)