Breaking News

యూనియన్‌ బ్యాంక్‌తోపాటు మరో సంస్థపై ఆర్‌బీఐ జరిమానా

Published on Sat, 05/24/2025 - 14:05

బ్యాంకింగ్, ఫిన్‌టెక్‌ రంగాల్లో ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడంలో విఫలమైనందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ట్రాన్సాక్ట్రీ టెక్నాలజీస్ (లెండ్‌బాక్స్‌)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జరిమానా విధించింది. నిబంధనల ప్రకారం నడుచుకోని సంస్థలపై కఠిన చర్యలుంటాయని ఆర్‌బీఐ పేర్కొంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై జరిమానా

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 నిబంధనలు, పూచీకత్తు లేని వ్యవసాయ రుణాలపై ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.63.6 లక్షల జరిమానా విధించింది. నిధుల బదిలీలో జాప్యం, పూచీకత్తు లేని రుణ విధానాల్లో ఉల్లంఘనలు వెలుగులోకి రావడంతో ఈ జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ముఖ్యంగా వ్యవసాయం వంటి ప్రత్యేక రక్షణ అవసరమయ్యే రంగాల్లో ఆర్థిక సంస్థలు నిర్దేశిత రుణ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూడాలని ఆర్‌బీఐ నొక్కి చెప్పింది.

ఇదీ చదవండి: ఆరోగ్య బీమా లేకపోతే పేదరికం తప్పదా?

ట్రాన్సాక్ట్రీ టెక్నాలజీస్‌(లెండ్ బాక్స్)పై పెనాల్టీ

ఆర్‌బీఐ పీర్-టు-పీర్ (పీ2పీ) లెండింగ్ ప్లాట్‌ఫామ్‌ డైరెక్షన్స్-2017ను పాటించనందుకు లెండ్‌బాక్స్‌ బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రాన్సాక్ట్రీ టెక్నాలజీస్‌పై రూ.40 లక్షలు జరిమానా విధించింది. దేశ డిజిటల్ లెండింగ్ ఎకోసిస్టమ్‌లో గణనీయమైన వృద్ధిని చూసిన పీ2పీ లెండింగ్ కార్యకలాపాలకు సంబంధించిన లోపాలను సెంట్రల్ బ్యాంక్ గుర్తించింది. ఫిన్‌టెక్‌ కంపెనీలు పారదర్శకత పాటించాలని, వినియోగదారులు, రుణదాతలను రక్షించడానికి రూపొందించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని గుర్తు చేసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)