Breaking News

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల తగ్గింపునకు ప్రోత్సాహకం

Published on Sat, 10/04/2025 - 08:34

బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను (గడువు తీరినా క్లెయిమ్‌ చేయకుండా ఉండిపోయినవి) తగ్గించేందుకు ఆర్‌బీఐ(RBI) ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఒక ఖాతా కార్యకలాపాల్లేకుండా (ఇనాపరేటివ్‌) ఉండిపోయిన కాలం, అందులో ఉన్న డిపాజిట్‌ ఆధారంగా బ్యాంకులకు ప్రోత్సాహకం చెల్లించనుంది. 4 ఏళ్లకు పైగా కార్యకలాపాల్లేని ఖాతాలకు సంబంధించి 5 శాతం లేదా రూ.5,000, అలాగే  పదేళ్లకు పైగా కార్యకలాపాల్లేని ఖాతాలకు సంబంధించిన డిపాజిట్ల విలువలో 7.5 శాతం లేదా రూ.25,000 ఏది తక్కువ అయితే ఆ మేరకు బ్యాంకులకు ప్రోత్సాహంగా అందనుంది.

ప్రస్తుతమున్న అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను అలాగే.. నిర్ణీత కాలం దాటిన తర్వాత డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అవేర్‌నెస్‌ (డీఈఏ) ఫండ్‌కు బదిలీ అయ్యే ఇలాంటి డిపాజిట్లను తగ్గించడం లక్ష్యంగా పథకాన్ని తీసుకొచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. కస్టమర్లు/ డిపాజిటర్లు తమ ఖాతాలను తిరిగి యాక్టివేట్‌ చేసుకునేందుకు.. అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను వారికి చెల్లించేందుకు వీలుగా బ్యాంకులను చురుగ్గా పనిచేయించడమే దీని ఉద్దేశమని పేర్కొంది. ప్రస్తుత నిబంధనల కింద బ్యాంకు ఖాతాల్లో క్లెయిమ్‌ లేకుండా 10 ఏళ్లకు మించిన డిపాజిట్లను డీఈఏ ఫండ్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇలా డీఈఏ కిందకు బదిలీ అయిన తర్వాత కూడా వాటిని డిపాజిటర్లు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్‌ నాటికి ఇలాంటి డిపాజిట్లు రూ.67,000 కోట్లుగా ఉన్నాయి.  

బంగారం తయారీదారులకు మూలధన రుణాలు

బంగారం, వెండి ముడి పదార్థంగా వినియోగించే తయారీదారులకు సైతం మూలధన రుణాలను (అవసరం మేరకు) అందించేందుకు బ్యాంక్‌లను ఆర్‌బీఐ అనుమతించింది. ఇప్పటి వరకు జ్యుయలర్లకే ఈ వెసులుబాటు ఉండేది.

ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)