Breaking News

ఫోన్‌పేకు రూ.21 లక్షల జరిమానా: కారణం ఇదే..

Published on Sat, 09/13/2025 - 15:56

నియమాలను ఉల్లంఘించిన బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. ఇప్పుడు ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పేకు భారీ జరిమానా విధించింది. 'ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్' (PPIs) కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు ఫోన్‌పే లిమిటెడ్‌కు 21 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

అక్టోబర్ 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను పాటించకపోవడం మాత్రమే కాకుండా.. ఈ విషయంలో సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలను పాటించలేదని ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ కారణంగానే ఫోన్‌పేకు నోటీస్ జారీ చేయడం జరిగిందని స్పష్టం చేసింది. జరిమానా విధించినప్పటికీ.. ఇది యూజర్లపై ఎటువంటి ప్రభావం చూడదని పేర్కొంది.

ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఫోన్‌పే వంటి అన్ని నాన్ బ్యాంకింగ్స్, ఎస్క్రో బ్యాలెన్స్‌లలో ఏదైనా లోటు ఉంటే వెంటనే రిజర్వ్ బ్యాంక్ పేమెంట్స్ & సెటిల్‌మెంట్ సిస్టమ్స్ విభాగానికి (DPSS) నివేదించాలి. ఎస్క్రో ఖాతా నిల్వలు.. రోజు చివరిలో వ్యాపారులకు చెల్లించాల్సిన బకాయి ఉన్న PPIల విలువ, చెల్లింపుల కంటే తక్కువగా ఉండకూడదని నిబంధనలు పేర్కొంటున్నాయి.

ఇదీ చదవండి: డీజిల్‌లో ఐసోబుటనాల్: కేంద్రమంత్రి కీలక ప్రకటన

పీపీఐ మార్గదర్శకాలను పాటించనందుకు.. రిజర్వ్ బ్యాంక్ ఫోన్‌పేకు 2019లో రూ. కోటి, 2020లో నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ. 1.39 కోట్ల జరిమానా విధించింది. ఇప్పుడు మరో సారి రూ. 21 లక్షల జరిమానా విధించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)