Breaking News

ఇక లోన్లు ఇవ్వొద్దు.. 4 కంపెనీలపై ఆర్బీఐ బ్యాన్‌

Published on Fri, 10/18/2024 - 09:23

నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంది. రుణాల మంజూరు, పంపిణీని నిలిపివేయాలని ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్, ఆరోహణ్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, డీఎంఐ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవీ ఫిన్‌సర్వ్ లిమిటెడ్‌లకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది . అక్టోబరు 21న వ్యాపార కార్యకలాపాలు ముగిసిన అనంతరం నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని పేర్కొంది.

ఈ కంపెనీల వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్ (WALR), వాటి నిధుల వ్యయంపై విధించే వడ్డీ స్ప్రెడ్ పరంగా ఈ కంపెనీల ప్రైసింగ్ పాలసీలో గమనించిన మెటీరియల్ సూపర్‌వైజరీ లోపాల ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇవి ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి: ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే.. ఆర్బీఐ రూల్స్‌ తెలుసా?

అయితే ఆయా కంపెనీలు తమ కస్టమర్లకు ఇతర సేవలను, రుణాల వసూలు, రికవరీ కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్థిక రంగంలో స్థిరత్వం కోసం, సంస్థలన్నీ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూసేందుకు ఆర్బీఐ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలపై చర్యలు చేపడుతూ వస్తోంది.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)