Breaking News

గౌతమ్ సింఘానియా కొత్త కారు - ధర తెలిస్తే షాక్ అవుతారు!

Published on Fri, 07/21/2023 - 09:56

భారతదేశంలోని సంపన్న వ్యక్తులలో ఒకరైన రేమండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'గౌతమ్ సింఘానియా' (Gautam Singhania) ఇటీవల ఖరీదైన స్పోర్ట్స్ కారుని కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మన దేశంలో అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలో గౌతమ్ సింఘానియా ఒకరు. ఇప్పటికే ఈయన వద్ద రూ. 6.37 కోట్ల విలువైన ఫెరారీ 296 జీటీబీ సూపర్‌కార్‌, లంబోర్ఘిని, పోర్స్చే, ఆస్టన్ మార్టిన్, రోల్స్ రాయిస్ వంటి హై ఎండ్ మోడల్ కార్లు ఎన్నో ఉన్నాయి. కాగా ఇప్పుడు రూ. 4 కోట్ల విలువైన మసెరటి ఎమ్‌సీ20 కూపే సొంతం చేసుకున్నాడు.

ఒక యూట్యూబ్ ఛానల్ అప్‌లోడ్ చేసిన వీడియోలో గౌతమ్ సింఘానియా తన సరికొత్త మసెరటి ఎమ్‌సీ20 డ్రైవ్ చేస్తూ ముంబై వీధుల్లో కనిపించినట్లు తెలిసింది. దాని వెనుక టొయోటా ఫార్చ్యూనర్‌లో గార్డ్‌లు రావడం కూడా గమనించవచ్చు.

మసెరటి ఎమ్‌సీ20..
మసెరటి ఎమ్‌సీ20 సూపర్ కారు 2020లో గ్లోబల్ అరంగేట్రం చేసింది. కాగా డెలివరీలు 2023 ప్రధమార్ధంలో మొదలయ్యాయి. సింఘానియా ఈ కారు డెలివరీని ముంబైలోని మసెరటి అధికారిక డీలర్‌షిప్ నుంచి పొందారు. ఇది 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ కలిగి 630 హార్స్ పవర్, 730 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)